రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్.. తొలి ఇండియన్ సినిమాగా ‘దేవ‌ర’

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’.

Update: 2024-09-13 14:27 GMT

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కాగా.. అభిమానులతో స‌హా అంద‌రూ ఎంతో ఈగర్‌గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్పణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో.. స్టార్ నటడు సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్రలో కనిపించనున్నాడు. అయితే.. ‘దేవర’ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. అందులో పార్ట్ 1 కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. అన్నీ భాష‌ల్లో క‌లిపి మిలియ‌న్స్ వ్యూస్‌తో ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

ఇదిలా ఉంటే.. దేవ‌ర ప్రీమియ‌ర్ షోను సెప్టెంబ‌ర్ 26 సాయంత్రం 6:30 గంట‌ల‌కు బియాండ్ ఫెస్ట్‌లో హాలీవుడ్, లాస్ ఏంజిల్స్‌లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్‌లో ప్రద‌ర్శించ‌నున్నారు. బియాండ్ ఫెస్ట్ ఘనమైన సినిమా చరిత్రను కలిగిన ప్రతిష్టాత్మకమైన సినిమా వేదిక. ఇలాంటి వేదిక‌లో రెడ్ కార్పెట్ ఈవెంట్ జ‌ర‌గ‌టం గొప్ప విష‌యం. అలాగే ఇక్కడ ప్రీమియ‌ర్ కాబోతున్న తొలి ఇండియన్ సినిమాగా దేవ‌ర అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు హాలీవుడ్‌కు చెందిన‌ సినీ ప్రముఖులు హాజ‌రు కాబోతున్నారు. దేవ‌ర టీమ్‌తో పాటు హై ఫై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు పాల్గొంటుండ‌టం అనేది ప్రపంచ వేదిక‌పై దేవ‌ర ఖ్యాతిని మ‌రింత ఇనుమ‌డింప చేయ‌నుంది. కాగా.. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Read More :

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే.. అక్కడ ఒక రోజు ముందుగానే దేవర రిలీజ్

ఎన్టీఆర్ సార్ మా అబ్బాయిని కాపాడండి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో


Similar News