మీడియా ముందుకు వెళ్ళకండి.. మహిళలు మాకు ఫిర్యాదు చేయండి : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
మీడియా ముందుకు వెళ్ళకండి.. మహిళలు మాకు ఫిర్యాదు చేయండి
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ ధైర్యం చేయలేదు.. ఓ లేడీ కొరియోగ్రఫీ లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు పెట్టింది. ఈ వివాదం పై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మంగళవారం ప్రెస్ మీట్ పెట్టింది. ఇండస్ట్రీలో అమ్మాయిల పై ఎవరైనా వేధింపులకు పాల్పడితే పరిష్కరించేందుకు 2018 నుంచి ప్యానెల్ అందుబాటులో గౌరవ కార్యదర్శి తెలిపారు.
లేడి కొరియోగ్రాఫర్ నుండి వచ్చిన సమస్యను మేము మా పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. ఈ విషయంలో ఇద్దరిది రికార్డ్ చేసాం.. త్వరలోనే ఈ సమస్యను పరిష్కారిస్తాము. ఫిర్యాదు విచారణ ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు. దాని వలన విచారణ పూర్తి అయ్యే వరకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను యూనియన్‌లో ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఇండస్ట్రీలో పని చేసే మహిళలు లైంగిక వేధింపులకు గురైతే డైరెక్ట్ గా మా వద్దకే రండి. మీడియా దగ్గరికి వెళ్ళకండి. మేము మీ సమస్యను పరిష్కరిస్తామంటూ తెలిపారు. ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల సమయంలో ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు.