CID Shakuntala: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Update: 2024-09-18 05:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ (South Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి CID శకుంతల (CID Shakuntala) (84) తీవ్ర అనారోగ్యంతో మంగళవారం రాత్రి తుది కన్నుమూశారు. ఛాతిలో నొప్పితో బెంగళూరు (Bangalore)లోని ఓ ఆసుపత్రితో చేరిన ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో దాదాపు 600 లకు పైగా మూవీస్, డైలీ సీరియల్ ఆమె యాక్ట్ చేశారు. అదేవిధంగా తమిళ ఇండస్ట్రీలో దిగ్గజాలుగా వెలుగొందిన ఎంజీఆర్ (MGR), శివాజీ గణేషన్ (Shivaji Ganeshan)లాంటి మహానటులతో ఆమె కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అదేవిధంగా తెలుగులో అక్కినేని నాగేశ్వర‌రావు నటించిన బుద్ధిమంతుడు, సూపర్‌స్టార్ కృష్ణ నటించిన నేనూ మనిషినే లాంటి చిత్రాల్లో నటించారు.  


Similar News