నన్ను క్షమించాలి.. విదేశాల్లో ఉన్నందున గురుచరణ్‌‌ను చూడలేకపోతున్నాను: మోహన్ బాబు

ప్రముఖ రచయిత గురుచరణ్‌ మృతిపై సీనియర్ నటుడు మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Update: 2024-09-12 16:08 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ రచయిత గురుచరణ్‌ మృతిపై సీనియర్ నటుడు మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. విదేశాల్లో ఉన్నందున ఆయనను చూడలేకపోతున్నానని, తనను క్షమించాలని ఆయన కోరాడు. మోహన్ బాబు తన ట్వీట్‌లో "ప్రముఖ రచయిత ఆత్రేయ దగ్గర గురుచరణ్‌ అసిస్టెంట్‌ రచయితగా పనిచేసేటప్పుడు నాకు పరిచయం. నా బ్యానర్‌ శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌లో వరుసగా దాదాపు 10 సినిమాలకు పాటల రచయితగా పని చేశారు. అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం, బ్రహ్మ మొదలైన సినిమాలకు అతను రాసిన పాటలన్నీ అత్యద్భుతం. అతని అకాల మరణానికి బాధపడుతూ ఆయన ఆత్మకు శాంతి, వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను. నేను ఇతర దేశాల్లో ఉన్నందున ఆయనను చూడలేకపోతున్నాను, నన్ను క్షమించాలి. అని రాసుకొచ్చాడు. కాగా గురుచరణ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్.


Similar News