‘న్యాయం కోసం’..హోంమంత్రిని కలిసిన నటి కాదంబరి జత్వానీ..!

ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన నటి కాదంబరి జత్వానీ(Kadambari Jatwani) కేసులో ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేసింది.

Update: 2024-09-19 09:13 GMT

దిశ,వెబ్‌డెస్క్:ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన నటి కాదంబరి జత్వానీ(Kadambari Jatwani) కేసులో ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేసింది. అయితే ఈ కేసులో ప్రమేయం ఉన్న ఎవరినీ వదిలిపెట్టేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..తాజాగా ముంబై నటి కాదంబరి జత్వానీ హోం మంత్రి అనితను(Home Minister Anita) కలిశారు. హోం మంత్రి అనితతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తన పై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని జత్వానీ ప్రభుత్వాన్ని కోరారు.  తనకు ఎదురైన పరిస్థితులు మరెవ్వరికి రాకూడదన్నారు. కేసును మరింత త్వరగా విచారణ చేయాలని కోరారు. తనకు జరిగిన నష్టానికి నష్టపరిహారం కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇక ఈ విషయం గురించి ఇటీవల హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. కాదంబరి జత్వాని కేసులో ఎవరి పాత్ర ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును చట్టబద్దంగా దర్యాప్తు జరుగుతోందని ఆమె తెలిపారు. సరైన ఆధారాలు(Proper evidence) నిరూపించడం కారణంగా ముగ్గురు IPS అధికారులను సస్పెండ్ చేశామని ఆమె పేర్కొన్నారు.


Similar News