ఆ హీరోయిన్ తో బ్రేకప్.. నా కాపురంలో చిచ్చు పెట్టకండి అంటూ హీరో వరుణ్ సందేశ్ షాకింగ్ కామెంట్స్!
హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను నటించిన హ్యాపిడేస్ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్ని అద్భుతంగా మెప్పించాడు.
దిశ, సినిమా: హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను నటించిన హ్యాపిడేస్ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్ని అద్భుతంగా మెప్పించాడు. తర్వాత కొత్త బంగారు లోకం సినిమాలో నటించిన వరుణ్‌కి అసలు తిరుగే లేదు అనుకున్నారు. కానీ, అతనికి సినిమా అవకాశాలు వచ్చినప్పటికి ఆశించిన విజయాలు మాత్రం రాలేదు. దాదాపు ఒక 20 కి పైగా సినిమాలు చేసినా కూడా వరుణ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేదు. కాగా హీరోయిన్ వితికా షేరును వివాహం చేసుకుని సెటిల్ అయ్యాడు. ఇక ఈ జంట 2019లో బిగ్‌బాస్ లో సందడి చేసి మరోసారి జనాలకు వరుణ్ దగ్గరయ్యాడు. అంతకుముందులా కాకుండా ఈ మధ్య మంచి కథలను ఎంచుకుంటూ భిన్నమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ ‘నింద’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ .. దావత్ అనే చిట్ చాట్ షోకు గెస్ట్ గా వెళ్ళాడు. ఈ షోకు హాట్ బ్యూటీ రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తోందన్న విషయం తెలిసినదే. ఇందులో భాగంగా తాజాగా వరుణ్ ను తన లవ్ బ్రేకప్ గురించి అడిగి అతడికి షాక్ ఇచ్చింది. హీరోయిన్ శ్రద్దా దాస్ తో మీరు బ్రేకప్ అయ్యారంట.. ఏంటి ఆ స్టోరీ అని అడిగింది..దానికి వరుణ్ "ఇప్పుడు అలాంటి విషయాలు మాట్లాడకండి. నా పెళ్లి అయ్యి 8 సంవత్సరాలు అవుతోంది. మా మధ్య గొడవలు పెట్టకండి. అప్పట్లో మేమిద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించాం. కానీ ప్రస్తుతం ఎవరి జీవితం వారిది. వాటి గురించి మాట్లాడదలచుకోలేదు" అంటూ అద్భుతమైన సమాధానం ఇచ్చాడు.
కాగా వరుణ్- శ్రద్ధా కలిసి మరో చరిత్ర అనే సినిమాలో నటించారు. అప్పట్లో వీరి మధ్య ప్రేమాయణం నడిచింది అన్న వార్తలు వచ్చాయి కానీ, అందులో నిజం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వరుణే స్వయంగా ఒప్పుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.