ఇండస్ట్రీకి మరో బ్రహ్మానందం దొరికేశారు..తాత పోలికలతో ఉన్న మనవడు ముద్దుగా ఏం చేస్తున్నాడంటే!

టాలీవుడ్ నవ్వుల రాజుగా తన కంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనను చూస్తే చాలు పెదవులపై చిన్న చిరు నవ్వు వస్తుంది. ఆయన కామెడీకి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

Update: 2024-05-20 02:39 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ నవ్వుల రాజుగా తన కంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనను చూస్తే చాలు పెదవులపై చిన్న చిరు నవ్వు వస్తుంది. ఆయన కామెడీకి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అంతే కాకుండా తన అద్భుతమైన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంత చేసుకున్న గ్రేట్ కమెడియన్ బ్రహ్మానందం.

అయితే తాజాగా ఈయన మనవడికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ చిన్నోడిని చూసిన వారందరూ అచ్చం బ్రహ్మానందం లానే ఉన్నాడు. ఇండస్ట్రీకి మరో బ్రహ్మానందం దొరికేశారు అంటూ ముచ్చటిస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మానందం కామెడీ చేయడంలోనే కాదు ఆయనలో ఎన్నో కలలు ఉన్నాయి. ఆయన ఓ చిత్రకారుడు. బ్రహ్మానందం వేసిన పెయింటింగ్స్ చాలా బాగుంటాయి. వీటిని చాలా సార్లు తన కుమారు గౌతమ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన దారిలోనే తన మనవడు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. గౌతమ్‌కు ఓపాప, బాబు ఉన్న విషయం తెలిసిందే. అయితే బాబు పేరు పార్థ. అతను అచ్చం తాతలానే పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశాడు. ఇక దీనిని తన బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ ఇన్ స్టాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారందరూ పార్థ అచ్చం తాతలానే ఉన్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాకుండా పోలికలు కూడా తాతవే ఉండటం తో పార్థను చూసిన అభిమానులు.. అచ్చం తాత పోలికలతో ఉన్నాడు. చూస్తే ఎంత ముద్దుగా ఉన్నాడో అంటున్నారు.


Similar News