స్టార్ హీరోయిన్‌ను వెంబడించిన కుక్క.. సెకండ్స్‌లో దాడి నుంచి తప్పించుకున్న బ్యూటీ!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియరా అద్వానీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతో బాలీవుడ్, టాలీవుడ్‌ను ఊపు ఊపేసింది ఈముద్దుగుమ్మ. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె తన బోల్డ్ ఫోటో షూట్‌తో రచ్చ చేస్తుంటుంది

Update: 2024-05-19 05:40 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియరా అద్వానీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతో బాలీవుడ్, టాలీవుడ్‌ను ఊపు ఊపేసింది ఈముద్దుగుమ్మ. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె తన బోల్డ్ ఫోటో షూట్‌తో రచ్చ చేస్తుంటుంది. అయితే తాజగా ఈ ముద్దుగుమ్మ ఓ పెన ప్రమాదం నుంచి తప్పించుకుంది.

అసలు విషయంలోకి వెళితే.. కియరా ముంబై ఎయిర్ పోర్టు‌లో కారు దిగి నడుచుకుంటూ వస్తుంది. అయితే అక్కడికి ఓ కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ కియరాను వెంబడించడం మొదలు పెట్టింది. దీనిని గమనించిన బ్యూటీ, కాస్త టెన్షన్ పడుతూ మెల్లిగా నడిచింది. ఆమెకు కుక్క అడుగు దూరంలో ఉన్నా సెక్యూరిటీ వాళ్లు గమనించలేదు. కానీ తర్వాత అప్రమత్తమైన వారు కుక్కను తరిమేసి, దాని నుంచి కాపాడారు. ప్రస్తుతం ఈన్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వామ్మో.. కియరా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. కుక్కదాడి చేయడానికి అడుగు దూరంలో ఉంది. కాస్త ఆలస్యం అయితే కుక్క కాటుకు బలి అయ్యేదంటూ ముచ్చటిస్తున్నారు. ఇక కియార బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరు చాలా కాలంగా డేటింగ్ చేసి తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ నటి చేతిలో అరడజన్‌కు పైగా సినిమాలతో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈముద్దుగుమ్మ తెలుగులో రామ్ చరణ్ సరసన గేమ్ చేంజర్ మూవీలో నటిస్తుంది.


Similar News