'హీరామండి ' సీక్వెల్‌లో బిగ్ బాస్ పింకి.. ఆడవాళ్లు కూడా అసూయపడే అందంతో మేని ఒంపులు..

'హీరామండి' లో అదితి రావు హైదరీ గజగామిని వాక్ సూపర్ పాపులర్ అయింది. కేన్స్ లోనూ ఆ నడకతో వయ్యారాలు పోయింది

Update: 2024-06-06 06:15 GMT

దిశ, సినిమా: 'హీరామండి' లో అదితి రావు హైదరీ గజగామిని వాక్ సూపర్ పాపులర్ అయింది. కేన్స్ లోనూ ఆ నడకతో వయ్యారాలు పోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ వాక్ ను బిగ్ బాస్ పింకి ట్రై చేసింది. ఇందుకు సంబంధించిన షాట్ షేర్ చేసింది. దీనిపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్పందిస్తూ.. దేవత అని పొగిడేసింది. తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా వావ్ అనేశారు. ఆమె టాలెంట్ కు ఫిదా అయ్యారు. సిరి హన్మంతు ఇచ్చిన ఐడియాను ఫాలో అయ్యానని చెప్పిన పింకి.. అందరూ పాజిటివ్ గా స్పందించినందుకు థాంక్స్ చెప్పింది.

కాగా నెటిజన్లు కూడా ఫస్ట్ టైమ్ ఆమె పోస్ట్ కు సానుకూలంగా స్పందించారు. అసలు అంత అందం ఇండస్ట్రీకి కనిపించడం లేదా అని అడుగుతున్నారు. హీరోయిన్ గా ఆమెకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటుందని దర్శక నిర్మాతలకు సూచిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తనను ఇలా చూస్తే తప్పక 'హీరామండి' సీక్వెల్ లో అవకాశం ఇస్తాడని అంటున్నారు. నిజంగా దేవుడు రాసిన రాతని ఎదిరించి పింకి అమ్మాయిగా మారినట్లు అనిపిస్తుందని కొనియాడుతున్నారు. ఇంత అందంగా ఉంటే ఆడవాళ్లు కూడా అసూయ పడుతారు.. దిష్టి తీసుకోమని చెప్తున్నారు.


Full View


Similar News