Tasty Teja : అర్థం అయిందా రాజా..? ఆటకు రెడీ ఈ యూట్యూబర్ టేస్టీ తేజ..
యూట్యూబర్ టేస్టీ తేజ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
దిశ, సినిమా : యూట్యూబర్ టేస్టీ తేజ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మొత్తానికి బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయి మంచి గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే 150 మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశానని.. దీని ద్వారా ఎంతో కొంత ఫేమ్ పొందానని చెప్పాడు. అయితే మరింత మందికి సుపరిచితం కావాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినట్లు చెప్పాడు. తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలకు చెందిన వారిని ఇంటర్వ్యూ చేసిన తనకు నాగార్జునను కూడా ఇంటర్వ్యూ చేయాలని ఉందని చెప్పాడు. సీజన్ ఉల్టా పుల్టా అయినా కవర్ చేసి.. మంచి మార్కులు కొట్టేస్తాననే ధీమాతో ఉన్నానని హౌజ్‌లోకి వెళ్లిపోయాడు.