Telugu Bigg Boss Season-8: బిగ్‌బాస్‌తో డీల్ మాట్లాడుకున్న బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్..!
నాగార్జున(Nagarjuna) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-2 (Telugu Bigg Boss Season-8) చివరి వారానికి వచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున(Nagarjuna) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 (Telugu Bigg Boss Season-8) చివరి వారానికి వచ్చింది. ఈ క్రమంలో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి స్టార్ మా సీరియల్ ఆర్టిస్టులు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ చూసినట్లైతే.. బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య(Brahma Mudi serial heroine Kavya) హౌస్ లో అడుగుపెట్టి తన ఫన్నీ ఫన్నీ క్యూట్ మాటలతో బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లను అండ్ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసింది. ఏకంగా బిగ్‌బాస్‌పై కూడా జోక్స్ వేసి నవ్వించింది. ఇక దీపికా(Deepika)ను కన్ఫెషన్ రూమ్(Confession room)కు పిలిచాడు.
ఏదైనా సీక్రెట్ చెప్పమని అడగ్గా.. నెక్ట్స్ ఎపిసోడ్‌లో నన్ను కంటెస్టెంట్‌గా సెలక్ట్ చేస్తేనే చెప్తానని.. లేకపోతే చెప్పనని అంటుంది. దీంతో బిగ్‌బాస్‌కు కోపం వచ్చి.. హౌస్‌లో కొన్ని నియమాలుంటాయి. వాటికి తగ్గట్లే నడుచుకోవాలంటారు. ఇక వెంటనే బిగ్‌బాస్‌ను క్షమాపణలు అడుగుతుంది దీపికా. ఇక దీపికతో కంటెస్టెంట్లంతా టాస్క్ ఆడుతారు. ఈ టాస్కులో ముక్కు అవినాష్(Avinash) విన్నర్ అవుతారు. చివరికి దీపికాను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లమని చెబుతాడు. గెస్ట్‌ను అలా పంపించొద్దని బిగ్ బాస్‌పైకే సీరియస్ అవుతుంది కావ్య. దీంతో కంటెస్టెంట్స్ అంతా దీపికా తరపున బిగ్ బాస్‌కు సారీ చెప్పారు. దీపికా వెళ్లిపోయిన తర్వాత ‘మామగారు’ (Māmagāru) సీరియల్ ఫేమ్ ఆకర్ష్(Akarsh), సుహాసిని(Suhasini) హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు.