బిగ్ బాస్ 8లో ఉహించని ట్విస్ట్.. చివరి నిమిషంలో ఎలిమినేట్ అయిన అవినాష్

తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.

Update: 2024-12-14 15:29 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ 8వ సీజన్ ప్రస్తుతం 11వ వారం కొనసాగుతోంది. కాగా ఈ వారంలో హౌస్ నుంచి షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందని ముందు నుంచి అభిమానులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ నటుడు అవినాష్ 105వ రోజు బిగ్ బాస్(biggboss) హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో అతను నాలుగో రన్నరప్(Runnarup) గా నిలిచాడు. కాగా అవినాష్(avinash) ఈ సీజన్ లో 35వ రోజు నుంచి వైల్డ్ కాడ్ ఎంట్రిలో వచ్చి 105వ రోజు వరకు హౌస్ లో కొనసాగాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ షోలో తొలుత 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా.. ఆ తర్వాత ఎనిమిది మంది కంటెస్టెంట్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు. ప్రతి కంటెంట్ తనకు సాధ్యమైనంతవరకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ బిగ్ బాస్ లవర్స్ ను మెప్పించారు. ఇలా దాదాపు 105 రోజులు సాగిన బిగ్ బాస్ తెలుగు 8 ప్రయాణం రేపటితో ముగియనున్నది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న హట్టహాసంగా నిర్వహించబోతున్నారు. మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా.. ప్రతి వారం ఎలిమినేషన్ల తర్వాత చివరికి ఐదురుగు మాత్రం గ్రాండ్ ఫినాలే‌లో చోటు దక్కించుకున్నారు. అయితే టైటిల్ రేసులో నబిల్, అవినాష్ లు ఎలిమినేట్ కాగా.. రేపటి ఫైనల్ డే లో గౌతమ్, నిఖిల్, ప్రేరణల్లో ఎవరో ఒకరు మాత్రమే బిగ్ బాస్ 8 విన్నర్‌గా నిలవనున్నారు. దీంతో బిగ్ బాస్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News