Bigg Boss Telugu Season-8: విన్నర్ ఎవరో తెలిసిపోయింది.. ఈసారి కప్పు కొట్టేది అతడే..?
ప్రతి సీజన్లలాగే బిగ్‌బాస్ సీజన్-8 కూడా విజయవంతంగా ముగిసింది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి సీజన్లలాగే బిగ్‌బాస్ సీజన్-8 (Bigg Boss Telugu Season 8) కూడా విజయవంతంగా ముగిసింది. కేవలం విన్నర్ ఎవరో ఒక్కటే తేల్చడమే మిగిలి ఉంది. దీంతో ఫైనల్స్‌పై తెలుగు బిగ్‌బాస్ ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొది. కప్పు కొట్టేదేవరో అంటూ సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు. కొంతమంది తమ అభిమాన కంటెస్టెంట్ల ఫొటోలు పెట్టి.. ఓట్లు వేసి గెలిపించాలంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ రెండ్రోజుల పాటు టాప్ 5 కటెస్టెంట్లకు సంబంధించిన ఈవీలు చూపించారు హోస్ట్ నాగార్జున(Host Nagarjuna). తమ బిగ్‌బాస్ ప్రయాణాన్ని మరోసారి గుర్తుచేశారు. కొందరు ఈ ఈవీలు చూసినాక.. విన్నర్ వీరే అంటూ డిసైడ్ అయిపోతున్నారు. ప్రస్తుతం అయితే టాప్ 5 లో గౌతమ్(Gautam), నిఖిల్(Nikhil), ప్రేరణ(Prerana), నబిల్(Nabil), అవినాష్(Avinash) ఉన్నారు.
వీరిలో ఇద్దరి పేరు కీలకంగా మారింది. గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరు టైటిల్ రేస్‌లో ఉన్నారు. సోషల్ మీడియా టాక్ ప్రకారం చూసినట్లైతే.. నాగార్జున టైటిల్ నిఖిల్‌కు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారంటూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నిఖిల్ తన ఎమోషన్స్‌ను లోపలనే ఉంచుకుంటూ బాధపడ్డాడే తప్ప బయటకు రానివ్వలేదు. ఓ సందర్భంలో ఓ విషయం గురించి చెప్పుకొచ్చారు. కానీ అంతగా ఎమోషనల్ అవ్వలేదు. ఇక ప్రేరణ టాస్కుల విషయంలో గొడవ పెట్టుకుని ఏడ్చేసింది. నబిల్ కూడా వీడియోలో చూసినట్లైతే..కేకలు పెడుతూ హడావిడి చేశారు. కాగా టైటిల్ 99 శాతం నిఖిల్ కే ఇవ్వాలని నాగ్ నిర్ణయించుకున్నాడంటూ ప్రజల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.