Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. ఈ తేదీ నుంచి షూటింగ్‌లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం.. ఎప్పటివరకంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Update: 2024-09-14 07:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత నెలలో మూడ్రోజులు బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షపాతం నమోదైనందున తెలుగు రాష్ట్రాలు అతలకుతలం అయ్యాయి. కాగా వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్ 6 కోట్లు విరాళంగా ప్రకటించారు. రెండు రాష్ట్రాల సీఎంఆర్‌ఎఫ్‌లకు చెరో రూ.కోటి చొప్పున విరాళం ప్రకటించారు పవన్ కల్యాణ్. ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు ఇవ్వనున్నారని తెలిపారు. ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున విరాళం ప్రకటించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే..

పవన్ కల్యాణ్ మూడు సినిమాలు పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. అందులో హరిహర వీరమల్లు ఒకటి. అయితే ఈ నెల (సెప్టెంబరు) 23 వ తేదీన ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభించబోతున్నారట. అదే రోజు పవర్ స్టార్ షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం. సెప్టెంబరు 23 కు జాయిన్ అయిన డిప్యూటీ సీఎం 20 రోజులు షూటింగ్‌లో ఉండనున్నారని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  


Similar News