మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైన యంగ్ హీరో.. ఆసక్తి రేపుతోన్న అనౌన్స్‌మెంట్ పోస్టర్

వెర్సటైల్ పెర్ఫార్మెన్స్‌తో, డిఫరెంట్ స్క్రిప్ట్‌లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు చార్మింగ్ స్టార్ శర్వా.

Update: 2024-09-19 11:37 GMT

దిశ, సినిమా: వెర్సటైల్ పెర్ఫార్మెన్స్‌తో, డిఫరెంట్ స్క్రిప్ట్‌లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు చార్మింగ్ స్టార్ శర్వా. ఇప్పుడు ఆయన తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘#Sharwa38’కు సిద్ధం అవుతున్నాడు. దీని కోసం మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుపొందిన బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నందితో చేతులు కలిపారు. 1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్‌ హై బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

ఇది శర్వా కెరీర్‌లోనే ఇంతకు ముందెన్నడూ చూడని ఎలిమెంట్స్‌తో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఇందులో శర్వా నంద్ 60ల నాటి క్యారెక్టర్‌ని పోషించేందుకు కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా మేకర్స్ రివీల్ చెయ్యగా.. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో మంటలు చెలరేగుతున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా ఉంది. కాగా.. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి పని చేసే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు. #Sharwa38 తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.


Similar News