పూనమ్ కౌర్ ఆరోపణలపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ

టాలివుడ్ డెరైక్టర్ త్రివిక్రమ్(Trivikram) మీద నటి పూనమ్ కౌర్(Poonam Kaur)సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-09-17 15:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) మీద నటి పూనమ్ కౌర్(Poonam Kaur) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాను త్రివిక్రమ్ మీద "మా(MAA)" కు ఫిర్యాదు చేసి ఇంతకాలం అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా అతన్ని ప్రశ్నించండి... ఫిర్యాదు చేసినందుకు తనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలు చేస్తూ పోస్ట్ చేసింది. పూనమ్ చేసిన ఈ ఆరోపణలపై డైరెక్టర్, ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ(Bharadwaja Thammareddy) స్పందించారు. 'తను "మా" కు ఎందుకు ఫిర్యాదు చేసింది, ఎప్పుడు ఫిర్యాదు చేసింది తనకు తెలియదని అన్నారు. మా ఫిర్యాదు బాక్స్ లో ఓ ఫిర్యాదు లెటర్ వేస్తే.. దానిపై ఏదైనా చర్యలు తీసుకోవడానికి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాత పూర్వక ఫిర్యాదు చేస్తే... తగు చర్యలు తీసుకుంటాం' అని అన్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఇదే హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.


Similar News