పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బర్రెలక్క.. ఇక రాజకీయాలకు గుడ్ బై?

కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఓ సంచలనం సృష్టించింది. హాయ్.. ఫ్రెండ్స్ నేను బర్రెలు కాస్తున్నాను.. నోటిఫికేషన్స్ వేయకపోవడంతో ఈ పని చేస్తున్నాను అంటూ..

Update: 2024-06-09 03:21 GMT

దిశ, సినిమా : కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఓ సంచలనం సృష్టించింది. హాయ్.. ఫ్రెండ్స్ నేను బర్రెలు కాస్తున్నాను.. నోటిఫికేషన్స్ వేయకపోవడంతో ఈ పని చేస్తున్నాను అంటూ.. ఓ వీడియో ద్వారా సంచలనంగా మారిన ఈమె రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గం నంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అంతే కాకుండా జోరుగా ఆమె ప్రచారం కూడా చేశారు. తన ప్రచారానికి ఎంతో మంది నిరుద్యోగ యువకు వెళ్లి కర్నె శిరీషకు సపోర్ట్ చేశారు. కానీ ఆమె మాత్రం విజయం సాధించలేకపోయింది. ఆమెకు కేవలం ఐదు వేల ఓట్లు మాత్రమే పోలు అయ్యాయి. దీంతో బర్రెలక్క ఇక రాజకీయాలకు దూరంగా ఉంటుంది. పెళ్లి చేసుకుంది కదా.. మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటది అని అందరూ అనుకున్నారు.

కానీ ఎవరూ ఊహించని విధంగా ఆమె పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. తన భర్తతో కలిసి తీవ్ర స్థాయిలోనే ప్రచారం చేసింది. కానీ ఈ ఎన్నికల్లో బర్రెలక్కకు ఊహించని షాక్ తగిలింది. అసెబ్లీ ఎన్నికల కంటే చాలా తక్కు ఓట్లు పోలయ్యాయి. కేవలం మూడు వేలకు పైగా ఓట్లు మాత్రమే రావడంతో, ఆమె పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. మరి ఈ ఓటమితోనైనా శిరీష రాజకీయాల నుంచి విరమించుకుంటారో లేదో చూడాలి అంటున్నారు కొందరు.


Similar News