త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్ పరోక్ష వ్యాఖ్యలు.. వైరల్!

టాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

Update: 2023-05-26 08:30 GMT
త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్ పరోక్ష వ్యాఖ్యలు.. వైరల్!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిర్మాతగా, కమెడియన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్లన్న.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. రోజూ ఏదో ఒక ట్వీట్‌తో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా.. డైరెక్టర్ త్రివిక్రమ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గణేష్ తన ఫ్యాన్స్‌తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘బండ్లన్న నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.

దీనికి అతడు ‘గురూజీని కలవండి లేదా క్లాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వండి. అప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది’ అంటూ నిర్మాత రిప్లై ఇచ్చాడు. మరో నెటిజన్ ‘గురూజీకి కథ చెబితే దానికి తగిన విధంగా స్క్రీన్ ప్లే రాసి అనుకున్న కథను షెడ్‌కు పంపిస్తాడటగా‘ అంటూ అడిగాడు. దీనిపై ‘అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తారు’ అంటూ బండ్లన్న బదులిచ్చిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే గురూజీ అంటే టాలీవుడ్ పరిశ్రమలో త్రివిక్రమని అందరికి తెలిసిందే. దీనిపై ఇక త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారనేది చూడాల్సిందే.

Also Read: అఖిల్ పై రామ్ చరణ్ స్పెషల్ ఫొకోస్.. అందుకేనా?

Tags:    

Similar News