మళ్లీ పెళ్లి.. లావణ్యకు మరో పెళ్లి ప్రపోజల్.. ఆమె తీసుకున్న నిర్ణయానికి అంతా షాక్!

నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న.. అంటూ కుర్రకారును మాయ చేసింది అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ తర్వాత భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన

Update: 2024-06-14 04:51 GMT

దిశ, సినిమా : నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న.. అంటూ కుర్రకారును మాయ చేసింది అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ తర్వాత భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాలతో హిట్ అందుకుంది. ఇక మిస్టర్ సినిమాలో నటించి, ఆ మూవీ టైమ్‌లో వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడింది. కొన్ని రోజుల పాటు సీక్రెట్‌గా వీరు లవ్ చేసుకొని, తర్వాత పెద్దల అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరు వివాహం తర్వాత వెకేషన్స్‌కు వెళ్తు ఫుల్ ఎంజాయ్ చేశారు. కానీ ఈ మధ్య మాత్రం లావణ్య చాలా సైలెంట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఈమె హాజరు కాలేదు. దీంతో అందరూ లావణ్య కనిపించడం లేదు ఎందుకు అని ఆరా తీయగా, తాను ప్రమాదానికి గురై కాలికి గాయమై ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిసిందే.

ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న లావణ్య సోషల్ మీడియాలో తమ అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అందులో ఓ నెటిజన్ లావణ్యకు పెళ్లి ప్రపోజల్ పెట్టారు. ఆయన కామెంట్ చేస్తూ.. మేడం మీరంటే నాకు చాలా ఇష్టం, ఈ జన్మలో వరుణ్‌ను పెళ్లి చేసుకున్నారు. కనీసం వచ్చే జన్మలోనైనా మనం పెళ్లి చేసుకుందాం అని తెలిపారు. దాని మెగా కోడలు సమాధానం ఇస్తూ.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు.అలాగే ఈ జన్మలో కాదు, జన్మ జన్మలకు వరుణే నా భర్త అంటూ తెలిపింది. దీంతో ఈమె సమాధానానికి మెగా ఫ్యాన్స్ షాకై, ఫిదా అయిపోయారు. లావణ్యకు వరుణ్ అంటే ఎంత ఇష్టమో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


Similar News