సినిమాల్లో నటించాలనుకునే వారికి అన్నపూర్ణ స్టూడియోస్ బంపర్ ఆఫర్ (పోస్ట్)
సినిమాల్లో నటించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దీంతో ఎంతో మంది స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు.
దిశ, సినిమా: సినిమాల్లో నటించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దీంతో ఎంతో మంది స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కొంతమంది తమకు చాన్సులు ఇవ్వాలంటూ డైరెక్టర్ల చుట్టూ తిరగడం లేదా తెలిసిన వారి ద్వారా ఇండస్ట్రీకి పోవాలని ప్రయత్నింటారు. కానీ కొందరికి అవకాశాలు దొరకడమే కష్టంగా మారింది. అయితే కొంతమంది నటనపై పిచ్చితో తిండి, నిద్ర మానేసి స్టూడియోస్ చుట్టూ తిరిగినప్పటికీ దురదృష్టం వల్ల అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ రెడీగా ఉండటం లేదు. ఎందుకంటే.. కొత్త వారిని పెట్టుకుంటే ఎలా చేస్తారో అన్న భయంతో డైరెక్టర్లు కూడా పాత నటీనటులతోనే సరి పెట్టేస్తున్నారు.
అయితే నటనపై ఇంట్రెస్ట్ ఉన్నవారికి అన్నపూర్ణ స్టూడియోస్ వారు బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. కొత్త సినిమా కోసం నటనపై ఉత్సాహవంతులైన వారు నటీనటులు కావాలి. అందుకోసం ‘‘actors@annapurnastudios.com’’ మెయిల్‌కు మీ పోర్ట్ పోలియోను పంపగలరు. అలాగే ఒక నిమిషం నిడివి గల అడిషన్ వీడియోను కూడా ఈ మెయిల్‌కి పంపించండి. మా చిత్రానికి అమ్మాయిలు, అబ్బాయిలు కావలెను. అబ్బాయిలు అయితే 24-28 ఏళ్ల మధ్య ఉన్నవారు.. అమ్మాయిలు 22-26 వరకు ఉండాలి. అలాగే యంగ్ బాయ్స్ 14-16, యంగ్ గర్ల్స్ 14-16 ఏళ్ల వరకు ఉండాలని ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నటనపై ఆసక్తి ఉన్నవారు కొందరు మెయిల్ చేసేస్తున్నారు. తమ టాలెంట్‌ను నీరూపించుకోవడానికి రెడీ అయిపోయారు. అయితే గాగుల్స్, కళ్తద్దాలతో తీసిన పిక్టర్స్ను మాత్రం అంగీరించరు సమాచారం.