ప్రకాశ్‌రాజ్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నిర్మాత.. మీ వల్ల రూ.కోటి నష్టం అంటూ
ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే ‘నేను మోనార్క్‌ని నన్ను ఎవరూ మోసం చేయలేరు’ అనే డైలాగ్‌తో ఫుల్ ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని తెలిసినప్పటి నుంచి ప్రకాశ్ రాజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టు పవన్ కూడా గట్టి కౌంటర్లే ఇస్తున్నాడు. ఈ క్రమంలో తమిళ నిర్మాత వినోద్ కుమార్.. ప్రకాశ్‌రాజ్‌కు గట్టిగా ఇచ్చిపడేశాడు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధితో కూర్చున్న ఫొటో షేర్ చేస్తూ.. “మీతో ఉన్న ముగ్గురు ఎన్నికల్లో గెలిస్తే.. మీరు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. అది మీ మధ్య తేడా. ఎలాంటి కారణం చెప్పకుండా మీరు షూటింగ్ నుంచి వెళ్లడంతో నాకు రూ.కోటి నష్టం వచ్చింది. కాల్ చేస్తానని చెప్పి ఇంతవరకు చేయలేదు” అని ఎక్స్ వేదికగా నిర్మాత ట్వీట్ చేశారు. కాగా వినోద్ కుమార్.. నటుడు ప్రకాశ్ రాజ్‌తో ‘ఎనిమీ’ అనే మూవీ తీశారు.