Nikhil Siddhartha: విడుదలకు సిద్ధమైన నిఖిల్ కొత్త సినిమా.. షాక్‌లో ఫ్యాన్స్ (పోస్ట్)

టాలీవుడ్ హీరో నిఖిల్ ‘కార్తీకేయ-2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ తెచ్చుకున్నారు.

Update: 2024-10-06 07:57 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నిఖిల్ ‘కార్తీకేయ-2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రజెంట్ నిఖిల్ ‘స్వయంభు’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే మరో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు కూడా లైన్‌లో పెట్టారు. ఇదిలా ఉంటే.. తాజాగా, నిఖిల్ కొత్త మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ రిలీజ్ తేదీ వచ్చేసింది. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన ఏ పోస్టర్‌ను ప్రకటించలేదు.

సడెన్‌గా విడుదల తేదీని అధికారికంగా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఇందులో నిఖిల్, సప్త సాగరాలుతో ఫేమ్ తెచ్చుకున్న రుక్మిణి వసంత్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మాణంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా దీపావళి కానుకగా రాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను మేకర్స్ ‘X’ ద్వారా విడుదల చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు షూటింగ్ ఎప్పుడు చేశారు అని నిఖిల్‌ను ప్రశ్నిస్తూ పలు పోస్టులు పెడుతున్నారు.


Similar News