పెళ్ళాం చేయకూడని పని అక్క చేయవచ్చా... పచ్చిగా రెచ్చిపోయిన అనసూయ, సెన్సేషనల్ పోస్ట్!

యాంకర్ అనుసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తన యాంకిరింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత ఈమెకు సినిమాల్లో

Update: 2024-05-19 05:21 GMT

దిశ, సినిమా : యాంకర్ అనుసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తన యాంకిరింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత ఈమెకు సినిమాల్లో అవకాశం రావడంతో యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పి నటిగా తన సత్తా చాటుతోంది. అనసూయ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈమె విలన్ రోల్‌లో ఆ పాత్రకు తగ్గట్టుగా చేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పుష్ప2లో దాక్షయాణి పాత్రలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా, ఓ డైరెక్టర్‌పై నిప్పులు చెరిగింది. సందీప్ రెడ్డి వంగకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అబ్బాయిలు, అక్క విషయంలో అలా.. భార్య విషయంలో ఇలా ఉంటారు అంటూ ఫైర్ అయ్యింది. ఇదే హైపోక్రసీ(కపటత్వం).. మీరు నన్ను హిపోక్రైట్ అంటారా? అని కామెంట్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే యానిమల్ మూవీలో హీరో తండ్రి తన సొంత బావను చంపేసి అక్కకు మరో పెళ్లి చేయమని చెప్తాడు. కానీ రణ్‌బీర్ కపూర్ మాత్రం యుద్దానికి వెళుతూ నేను వస్తానో లేదో తెలియదు, నువ్వు రెండో పెళ్లి మాత్రం చేసుకోకు అని చెప్తాడు. దీని మీదే అనసూయ డైరెక్టర్‌కు కౌంటర్ ఇస్తూ పోస్ట్ చేసింది.


Similar News