Amala paul: అలాంటి డ్రెస్‌లో అమలాపాల్.. స్టూడెంట్స్‌కు ఏం సందేశం ఇస్తున్నావంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు

మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-07-26 03:57 GMT
Amala paul: అలాంటి డ్రెస్‌లో అమలాపాల్.. స్టూడెంట్స్‌కు ఏం సందేశం ఇస్తున్నావంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు
  • whatsapp icon

దిశ, సినిమా: మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఇద్దరమ్మాయిలతో’, ‘నాయక్’, ‘లవ్ ఫెయిల్యూర్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఈ అమ్మడు సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా లైమ్ లైట్‌లో ఉంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘లెవెల్ క్రాస్’ అనే సినిమాలో నటించింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అందులో భాగంగానే రీసెంట్‌గా కేరళలోని ఎర్నాకులంలోని ఓ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్‌కు హాజరైంది. ఈ కార్యక్రమంలో ఆమె వేసుకున్న డ్రెస్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆమె దుస్తులపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. విద్యా సంస్థలలో జరిగే ప్రమోషనల్ ఈవెంట్స్‌కు కాస్త పద్దతిగా వెళ్తే బాగుంటుందని.. పొట్టి దుస్తుల్లో వెళ్లి విద్యార్థులకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

అయితే తన డ్రెస్‌పై వస్తున్న విమర్శలపై అమలా పాల్‌ కూడా స్పందించింది. ఆ డ్రెస్‌లో తాను కంఫర్ట్ గానే ఉన్నానని తెలిపింది. “కాలేజీలో జరిగిన ఈవెంట్‌లో నేను ధరించిన డ్రెస్ నాకు చాలా సౌకర్యంగా ఉంది. అలాంటి దుస్తులు వేసుకొని ఆ ఈవెంట్‌కు వెళ్లడం తప్పుగా అనిపించలేదు. నిజానికి నా దుస్తుల కంటే, ఆ ఫోటోలు తీసిన వారిదే అసలు సమస్య. వారు నా ఫోటోలు ఎలా తీశారు అనేది చర్చ జరగాల్సిన అంశం. ఆ దుస్తుల్లో నన్ను చూడటం విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యంగా అనిపించలేదు. నేను మోడ్రన్ డ్రెస్సులతో పాటు సంప్రదాయ దుస్తులు కూడా ధరిస్తాను. కాలేజీకి నేను ఆ డ్రెస్ వేసుకుని వెళ్లడం వెనుక ఉద్దేశం విద్యార్ధులలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికే” అంటూ చెప్పుకొచ్చింది.

(video link credits to amalapaul instagram id)

Tags:    

Similar News