కూతురితో కలిసి ఆ పని చేస్తున్న అల్లు అర్జున్ భార్య.. వీడియో వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య, స్నేహ రెడ్డి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. వన్నె తగ్గని అందం ఆమె సొంతం. హీరోయిన్లకు మించి తన గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది స్నేహ. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా తన హాట్ హాట్

Update: 2024-06-07 04:23 GMT

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య, స్నేహ రెడ్డి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. వన్నె తగ్గని అందం ఆమె సొంతం. హీరోయిన్లకు మించి తన గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది స్నేహ. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా తన హాట్ హాట్ ఫొటోషూట్స్‌తో కుర్రకారు మదిని దోచేస్తుంటుంది. అంతే కాకుండా అర్హ, అయాన్‌లకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తూ.. తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది.

తాజాగా స్నేహ తన ఇన్ స్టా‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతుంది. అయితే ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా? అల్లరి చేయడం కామన్, కానీ తల్లి తన పిల్లలతో కలిసి అల్లరి చేస్తుంటే అది కొత్తగా ఫన్నీగా అనిపిస్తుంటుంది. అయితే స్నేహ కూడా తన కూతురుతో కలిసి బబుల్ గేమ్ తింటూ.. దానిని బెలూన్ ఊదుతున్న వీడియో షేర్ చేసింది. ఇక ఈ వీడియో చాలా ఫన్నీగా ఉండటంతో దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప2 సినిమా షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నారు. ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


Similar News