వారం రోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆలియా భట్ ..

పెళ్లి చేసుకుంటే హీరోయిన్స్ కెరీర్ ఎండ్ అయిపోయినట్టే అన్నది పాత మాట. ప్రస్తుతం మ్యారేజ్ చేసుకొని కూడా సినీ ఇండస్ర్టీలో సత్తా చాటుతున్నారు కథానాయికలు. ఆ లిస్ట్‌లో ఆలియా భట్ కూడా ఒకరు. ప్రేమించిన రణ్‌బీర్‌ కపూర్‌ను

Update: 2023-08-06 07:56 GMT

దిశ, సినిమా: పెళ్లి చేసుకుంటే హీరోయిన్స్ కెరీర్ ఎండ్ అయిపోయినట్టే అన్నది పాత మాట. ప్రస్తుతం మ్యారేజ్ చేసుకొని కూడా సినీ ఇండస్ర్టీలో సత్తా చాటుతున్నారు కథానాయికలు. ఆ లిస్ట్‌లో ఆలియా భట్ కూడా ఒకరు. ప్రేమించిన రణ్‌బీర్‌ కపూర్‌ను సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న ఆమె.. ఏడాదిలోపు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కెరీర్‌లో మళ్లీ బిజీ అయిపోయింది. తాజాగా ఆలియా ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలాకాలం తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీలో ఆలియా, హీరో రణ్‌వీర్‌కి జరిగే పెళ్లి సీన్ చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఈ సీన్‌ను చూసి ఆలియా రియల్ లైఫ్ పెళ్లిని చూసినట్టే ఉందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సీన్ గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు కరణ్ జోహార్. ‘ఆలియా, రణ్‌బీర్‌లకు పెళ్లి జరిగిన మూడు రోజులకే ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ మూవీలోని పెళ్లి సీన్‌ను షూట్ చేశాము. అంటే వారం రోజుల వ్యవధిలో ఆలియా భట్ రెండుసార్లు పెళ్లి చేసుకుంది. ఒకటి రీల్ లైఫ్, మరొకటి రియల్ లైఫ్’ అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.


Similar News