లక్ష్మీతో విడాకులు తీసుకొని ఇన్నేళ్లైనా కానీ ఒక్కసారి కూడా అలాంటి పని చేయని నాగార్జున..కారణం అదేనా!
ప్రస్తుత జనరేషన్లో పెళ్లి చేసుకోవడం ఎంత కామనో..విడాకులు తీసుకోవడం కూడా అంతే కామన్ అయిపోయింది ..
దిశ, సినిమా: ప్రస్తుత జనరేషన్లో పెళ్లి చేసుకోవడం ఎంత కామనో..విడాకులు తీసుకోవడం కూడా అంతే కామన్ అయిపోయింది .. కేవలం ఒకరిద్దరు కాదు ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకున్నారు. ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకొని నూరేళ్లు కలిసి జీవించాలి అని అనుకోని కొన్ని మనస్పర్థల కారణంగా కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా విడాకులు తీసుకుంటూ ఉంటారు.
అయితే విడాకులు తీసుకున్న తర్వాత కొందరు చాలా ఫ్రెండ్లీగా ముందుకు వెళుతూ ఉంటే..మరి కొందరు మాత్రం విడాకులు తీసుకొని కొన్ని సంవత్సరాలు దాటిపోతున్నా సరే అసలు ముఖం కూడా చూసుకోకుండా మాట కూడా మాట్లాడుకోకుండా ఉంటారు . అలాంటి వాళ్ళలో నాగార్జున - లక్ష్మి దగ్గుబాటి కూడా ఒకరు.
దగ్గుబాటి ఆడపడుచు లక్ష్మీ పెళ్లి చేసుకున్న నాగార్జున నాగచైతన్య పుట్టాక ఆమెకు విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే. వాళ్ళ మధ్య వచ్చిన కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు ఇచ్చేసారట. అయితే ఆ తర్వాత లక్ష్మి- నాగార్జున నాగచైతన్య పెళ్లిలో ఎదురుపడిన సరే.. అస్సలు మాట్లాడుకోలేదట. అంతేకాదు పలు సందర్భాల్లో వీళ్ళు ఎదురుపడినా కూడా నాగార్జున మాట్లాడడు ..లక్ష్మి మాట్లాడదు.. రీజన్ ఏంటో తెలియదు కానీ వీళ్ళ విడాకుల్లో ఏదో బలమైన కారణం ఉంది అని అందుకే విడాకులు తీసుకొని ఇన్ని ఏళ్ళు అవుతున్న ఇప్పటికీ ఈ జంట మాట్లాడుకోవడం లేదు అంటూ ఓ న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..!!