మాజీ ఎమ్మెల్యేకు నటి త్రిష లీగల్ నోటీసులు

అన్నాడీఎంకే నేత, మాజీ ఎమ్మెల్యే రాజు ఇటీవల ప్రముఖ నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రూ.25 లక్షలు ఇచ్చి త్రిషను రిసార్ట్‌కు రప్పించామని, అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించామని రాజు వ్యాఖ్యానించారు.

Update: 2024-02-22 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: అన్నాడీఎంకే నేత, మాజీ ఎమ్మెల్యే రాజు ఇటీవల ప్రముఖ నటి త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రూ.25 లక్షలు ఇచ్చి త్రిషను రిసార్ట్‌కు రప్పించామని, అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించామని రాజు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అటు రాజకీయాల్లోనే కాకుండా, సౌత్ సినీ పరిశ్రమలో దుమారం రేగాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా అనేకమంది త్రిషకు మద్దతు తెలిపారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో మాజీ ఎమ్మెల్యే రాజు తప్పనిసరి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పారు. తాజాగా.. ఈ మొక్కుబడి క్షమాపణ సరిపోదంటూ త్రిష సీరియస్ అయ్యారు.

ఈ నేపథ్యంలోనే గురువారం ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో త్రిష డిమాండ్ చేసింది. లేకపోతే పరువునష్టం దావా వేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతకుముందు సోషల్ మీడియాలో రాజును త్రిష కడిగిపారేసింది. అటెన్షన్ కోసం దిగజారి మాట్లాడే వారిని చూస్తే అసహ్యం వేస్తోందంటూ పేర్కొన్నారు. కాగా, త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఇంకా మరువకముందే మరొకరు ఈ తరహా కామెంట్లు చేయడం దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది.

Read More..

Rashmika Mandanna : కొత్త లుక్‌లో దర్శనమిచ్చిన నేషనల్‌ క్రష్‌ రష్మిక ..  

Tags:    

Similar News