క్యాన్సర్ రావడంతో షో నుంచి తొలగించారు.. నటి ఎమోషనల్
నటి, మోడల్ లీసారే వాటర్, కసూర్, వీరప్పన్, దోబారా వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.Latest Telugu News
దిశ, సినిమా: కసూర్, వీరప్పన్, దోబారా వంటి సినిమాల్లో నటించి లీసారే మంచి గుర్తింపు దక్కించుకుంది. 2009లో బోన్‌మారో వంటి అత్యంత అరుదైన కేన్సర్ బారినపడింది. ఈ రకం క్యాన్సర్ వచ్చిన వారు కచ్చితంగా బ్రతికి బయట పడే అవకాశం లేదు. కానీ లీసారే మాత్రం గుండె ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడి క్యాన్సర్‌ను జయించింది. ఇక రీసెంట్ గా 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే పోస్ట్' లో తనకు ఎదురైన ఈ అనుభవాన్ని నేషనల్ కేన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా పంచుకుంది. '' కీమోథెరపీ చేయించుకున్న సమయంలో జుట్టు ఊడిపోవడంతో నన్ను ఓ టీవీ షో నుంచి తొలగించారు. నాకు వచ్చిన బోన్‌మారో క్యాన్సర్ కారణంగా క్రమం తప్పకుండా కీమోథెరపీ చేయించుకోవాల్సి రావడంతో జుట్టు లేకుండా గడిపా. ఈ క్రమంలోనే ఓ ట్రావెల్ షో నుంచి కూడా తొలగించారు'' అని ఎమోషనల్ అయింది.
ఇవి కూడా చదవండి : మోక్షజ్ఞ కోసం కొత్త అవతారమెత్తనున్న బాలయ్య