నటి గాయత్రి గుప్తా ఆరోగ్యం విషమం.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు!

గాయత్రి గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీని షేక్ చేసి.. రచ్చ రేపింది.

Update: 2024-05-30 03:18 GMT

దిశ, సినిమా: గాయత్రి గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీని షేక్ చేసి.. రచ్చ రేపింది. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరియర్ స్టార్ట్ చేసి.. ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం వంటి చిత్రాల్లో నటించిన గాయత్రి గుప్తా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ బయట మాత్రం బోల్డ్‌గా ఉంటూ కుర్రళ్ల గుండెళ్లో గునపాలు దించుతోంది. గత ఏడాది వచ్చిన దయా అనే వెబ్ సిరీస్‌లో గాయత్రి గుప్పా కీలక పాత్రలో చేసి మెప్పించింది.

ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. అంతేకాకుండా ప్రస్తుతం తన ఆరోగ్యం బాగా లేక చాలా వరకు ఖర్చు అయ్యిందని, ట్రీట్మెంట్ కోసం మొత్తం రూ. 12 లక్షలు ఖర్చు అవుతుందని, కానీ ఇప్పటివరకు లక్ష రూపాయలు కూడా అందలేదని తెలిపింది. తన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోందని, గొప్ప మనసు కలిగిన దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయమని కోరింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి గాయత్రీ గుప్తాను ఇండస్ట్రీలోని పెద్దలు ఆదుకొంటారేమో చూడాలి.

కాగా గతేడాది తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చికిత్స కోసం డబ్బులు హెల్ప్ చేయాలని కోరిన విషయం తెలిసిందే.


Similar News