అందుకే రాజకీయాల్లోకి వెళ్లాడు.. పవన్ కళ్యాణ్ గెలుపుపై నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై నటుడు నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే పవన్ రాజకీయాలపై ఎంతో మంది నటీనటులు పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ నటుడు నరేష్ ఆసక్తికర

Update: 2024-06-02 05:01 GMT

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై నటుడు నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే పవన్ రాజకీయాలపై ఎంతో మంది నటీనటులు పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ నటుడు నరేష్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. పవన్ రాజకీయాల్లోకి పదవి కోసం వెళ్లలేదు అనేది నా పర్సనల్ ఫీలింగ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఆయన ఏమీ లేనప్పుడు కూడా గతంలో పీపుల్స్ ఆర్మీ పెట్టి చాలా మందికి కొన్ని కోట్లు సాయం చేశారు. ఇవన్నీ దేని కోసం చేశారు అంటే జనాల కోసం ఏదో చేయాలనే ధృడ సంకల్పమే ఆయనను రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది తప్ప, పదవి కోసం కాదు. ఈ ఎన్నికల్లో రామారావు తర్వాత దమ్ము ఉండి నిలబడిన వ్యక్తి, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా పోరాటం ఆపకుండా, వారాహి ని తీసుకొని ఆయన ప్రజల్లోకి వెళ్లి చేసిన పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే, సినిమా ఇండస్ట్రీ నుంచి ఓ దీక్షతో వెళ్లిన వ్యక్తి చివరికి విజయం సొంతం చేసుకుటున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ధృఢ సంకల్పం అలాంటిది. ఏపీ ప్రజలకు కూడా అలాంటి వ్యక్తి తప్పనిసరిగా కావాలి అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఏపీ ఎన్నికలు ముగిసి 15 రోజులు పూర్తి అవుతున్న విషయం తెలిసిందే. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందో అంటూ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం అని ఇప్పటికే ఆయన ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. కాగా, ఏం జరుగుతుందో చూడాలి అంటే రిజల్ట్స్ వచ్చే వరకు ఆగాల్సిందే.


Similar News