బేబీ డైరెక్టర్‌కు వింత అనుభవం.. సిగ్గు లేకుండా అలా చేశానంటూ ఆసక్తికర పోస్ట్ వైరల్

టాలీవుడ్ డైరెక్టర్ సాయి రాజేష్ అందరికీ సుపరిచితమే. పలు సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ గత ఏడాది ఆయన డైరెక్షన్‌లో వచ్చిన బేబీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

Update: 2024-07-06 07:37 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ సాయి రాజేష్ అందరికీ సుపరిచితమే. పలు సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ గత ఏడాది ఆయన డైరెక్షన్‌లో వచ్చిన బేబీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో సాయి రాజేష్ పాపులారిటీ మరింత పెరిగిపోయింది. బేబీ సినిమాపై పలువురు సినీ స్టార్స్ సైతం ప్రశంసలు కురిపించడంతో పాటు సాయి రాజేష్‌ను మెచ్చుకున్నారు. చిరంజీవి కూడా బేబీ డైరెక్టర్, నిర్మాతను ఇంటికి పిలిచి మరి సన్మానం చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, సాయి రాజేష్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వింత అనుభవం గురించి వివరిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. తాను చేసిన సినిమా బేబీ అయినప్పటికీ ఓ బేబీ గురించి మాట్లాడటంతో సాయి రాజేష్ వింత అనుభవం ఎదురైందని దానిని వివరించాడు.

‘‘నిన్న ఒక స్నేహితుడు బలవంతం మీద, తన ప్రాణస్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాను, “నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం, 50 సార్లు చూసుంటాడు. ఇన్నేళ్ల మా స్నేహం లో ఏది అడగలేదు, నిన్ను భోజనానికి తీసుకు రమ్మన్నాడు” అన్నాడు. సర్లే మనకి ఈ చపాతీలు, రోటీలు మొహం మొత్తింది, హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్లాను. 10 రకాల వంటలు, అద్భుతమైన ఆతిథ్యం , ఎంత గొప్ప సినిమా సర్ …అని వాళ్ళ ఆవిడకి, పక్కింటి వాళ్లకి, గేట్ దగ్గర వాచ్ మాన్ కి, కొరియర్ బాయ్ కి, సార్ తో సెల్ఫీ దిగండి, “బేబీ సినిమా డైరెక్టర్“ అని 30 ఫోటోలు ఇప్పించారు. ఒక గంట తర్వాత ప్లేట్ లో గారెలు, నాటుకోడి పులుసు వడ్డించారు. “మా అమ్మాయి కి సమంత అంటే చాలా ఇష్టమండి, ఒక ఫోటో ఇప్పించండి, మళ్లీ ఎప్పుడు చేస్తున్నారు ఆవిడ తో ” అన్నాడు. ఇంత జరిగినా గారెలు సిగ్గు లేకుండా లోపలకి వెళ్లి పోయినాయి. ఓ బేబి’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం డైరెక్టర్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.


Similar News