డార్లింగ్ తన సినిమా రిలీజ్‌కు ముందు రోజు ఏం చేస్తాడో తెలుసా..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-10-05 02:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ ‘కల్కీ 2898ఏడీ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ‘రాజా సాబ్’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కీ 2’, ‘ఫౌజీ’ వంటి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో డార్లింగ్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..?

కొన్ని రోజుల క్రితం రాజమౌళి డాక్యుమెంటరీ సిరీస్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చాలా రోజుల నుండి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే రాజమౌళి డాక్యుమెంటరీ ప్రమోషన్స్‌లో పాల్లొన్న ప్రభాస్.. ఆయనకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు. డార్లింగ్ ఆ డాక్యుమెంటరీ సిరీస్‌లో మాట్లాడుతూ .. “నేను నటించిన సినిమా కనుక రిలీజ్ అవుతుంది అంటే నేను ఆ ముందు రోజు ఫోన్ స్విచ్ ఆఫ్‌లో పెట్టేస్తా. మా ఫ్రెండ్స్‌కు ఒక వేళ సినిమా మంచి టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంటేనే ఫోన్ చేయమని, లేదంటే అస్సలు ఫోన్ చేయకండి అని చెప్తాను” అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం డార్లింగ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై నెటిజన్లు.. ఎంత పాన్ ఇండియా స్టార్ అయినా కూడా తన మూవీ రిలీజ్ అవుతుందంటే భయపడాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Similar News