టబుకు నాగార్జున పెట్టిన రొమాంటిక్‌ ముద్దు పేరెంటో తెలిస్తే షాక్!

నెంబర్-1 చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-05-01 13:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: నెంబర్-1 చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వెంకటేష్ సరసన నటించి మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో టుబుకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా నాగార్జునతో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నాగార్జున రొమాన్స్‌కు టబు అందం తోడు కావడంతో బాక్సాఫీసు షేక్ అయ్యిందని చెప్పుకోవచ్చు.

వీరిద్దరి రొమాన్స్ తెలుగు ఆడియన్స్‌ను ఊపేసింది. అలా టబు-నాగార్జున మధ్య మంచి మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే.. టుబుకు నాగార్జున రొమాంటిక్ గా ఓ ముద్దు పేరు పెట్టి పిలిచేవారట. ఈ విషయాన్ని టబు ఓ ఈవెంట్ లో చెప్పడం విశేషం. నాగార్జున తనను ‘పండు’ అని ముద్దు పేరు పెట్టారని.. నాగార్జునకు థాంక్యూ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈవెంట్ మొత్తం అరుపులు కేకలతో గోల చేశారు.


Similar News