అమ్మతనానికే మాయని మచ్చ ఆ తల్లి!

దిశ, వెబ్‌డెస్క్ : తల్లి ప్రేమ.. అన్ని బంధాల్లోకెళ్ల చాలా బలమైనది. వెలకట్టలేనిది. అత్యంత విలువైనది. ఖండాంతరాలు దాటిన తల్లి ప్రేమ ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. తండ్రి ప్రేమ గొప్పదా.. తల్లి ప్రేమ గొప్పదా అంటే చాలా మంది రెండో దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. తండ్రి బిడ్డ జన్మకు కారణమైతే.. తల్లి నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడమే కాకుండా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఒక స్టేజ్‌ వచ్చాక తమ పిల్లలు తప్పు చేశాడని తెలిసినా […]

Update: 2021-01-29 05:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తల్లి ప్రేమ.. అన్ని బంధాల్లోకెళ్ల చాలా బలమైనది. వెలకట్టలేనిది. అత్యంత విలువైనది. ఖండాంతరాలు దాటిన తల్లి ప్రేమ ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. తండ్రి ప్రేమ గొప్పదా.. తల్లి ప్రేమ గొప్పదా అంటే చాలా మంది రెండో దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. తండ్రి బిడ్డ జన్మకు కారణమైతే.. తల్లి నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడమే కాకుండా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఒక స్టేజ్‌ వచ్చాక తమ పిల్లలు తప్పు చేశాడని తెలిసినా వారిని సమర్థించుకునేంత ప్రేమ ఒక్క తల్లికే చెందుతుందంటే అతిశయోక్తి కాదు.

ఈ తల్లి ప్రేమ కేవలం మనుషుల్లోనే కాదు.. పశు పక్షాదులు, జంతువుల్లోనూ మనం తరుచూ చూస్తునే ఉంటాం. తన సంతానాన్ని రక్షించుకోవడానికి పక్షులు, జంతువులు ఎంతగా తాపత్రాయ పడుతుంటాయో మనిషి తన జీవితంలో ఒక్కసారి అయినా చూసి ఉంటాడు. తమ మనుగడ కోసం వన్యప్రాణులను చంపి తినే క్రూరమృగాలు సైతం తన పిల్లలను ఇతర మృగాల నుంచి రక్షించుకునేందుకు ప్రతిరోజూ జీవనమరణ పోరాటం చేస్తుంటాయి. అలాంటి తల్లి ప్రేమను కొన్నిసార్లు మాటల్లో కూడా వర్ణించలేము.

కోట్లిచ్చినా దొరకని అలాంటి ప్రేమను కొందరు తల్లులు అపహస్యం చేస్తున్నారు. అమ్మ అనే పదానికే వారు మాయని మచ్చగా నిలుస్తున్నారు. ఇటీవల కాలంలో కొందరు తల్లులు తీసుకుంటున్న నిర్ణయాలే అందుకు కారణంగా తెలుస్తోంది. మరికొందరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు తమ బిడ్డలను బలి చేస్తుంటే.. ఇంకొందరు అప్పుడే పుట్టిన పసిగుడ్డులను తమకేమీ పట్టనట్టుగా ముళ్లపొదలు, చెత్త డబ్బాలు, ఆస్పత్రి ప్రాంగణాల్లో వదిలేసి వెళ్తున్నారు. ప్రస్తుత సమాజంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అయ్యాయి.

ఇదంతా ఒక వైపయితే కొందరు తల్లులు మాత్రం తమ బిడ్డలను డబ్బులు సంపాదించి పెట్టే వస్తువుగా పరిగణిస్తున్నారు. అప్పుడే పుట్టిన పసికందులను ఆస్పత్రిలోని సిబ్బంది సాయంతో పిల్లలు లేని వారికి అమ్ముకుంటున్నారు. ఇందులో ఆడశిశువులను ఎక్కువగా విక్రయిస్తుండగా.. పోషణ భారమై మరికొందరు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఇలాంటి ఘటనే సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.15 రోజుల వయస్సున్న చిన్నారిని ఓ తల్లి రూ.35 వేలకు విక్రయించింది. ఈ విషయాన్ని అంగన్ వాడీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమివ్వగా వారు విచారణ చేపట్టారు. శిశువును అమ్మిన తల్లితో పాటు కొనుగోలు చేసిన వ్యక్తులు, దీనికి సహకరించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News