తల్లి చిత్రపటానికి కొడుకు అంత్యక్రియలు

దిశ, వెబ్ డెస్క్: ఆమె ఉపాధి కోసం విదేశాలకు వెళ్లింది. కొన్నాళ్లకు అక్కడ ఆమె అనారోగ్యం పాలైంది. దీంతో ఆమె కోలుకోలేక మృతి చెందింది. కరోనా నేపథ్యంలో ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె చిత్రపటాన్ని శవపేటికలో ఉంచి అంత్యక్రియలు చేశాడు కన్నకొడుకు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. కాళ్ల మండలం జువ్వలపాలెంకు చెందిన ఘాతల మేరీ(45) ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లింది. […]

Update: 2020-08-16 05:23 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆమె ఉపాధి కోసం విదేశాలకు వెళ్లింది. కొన్నాళ్లకు అక్కడ ఆమె అనారోగ్యం పాలైంది. దీంతో ఆమె కోలుకోలేక మృతి చెందింది. కరోనా నేపథ్యంలో ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె చిత్రపటాన్ని శవపేటికలో ఉంచి అంత్యక్రియలు చేశాడు కన్నకొడుకు.

ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. కాళ్ల మండలం జువ్వలపాలెంకు చెందిన ఘాతల మేరీ(45) ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లింది. అనారోగ్యం కారణంగా అక్కడే మృతి చెందింది. కరోనా కారణంగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చే అవకాశం లేకపోవడంతో ఆమె కొడుకు తల్లి ఫొటోకు అంత్యక్రియలు చేశాడు.

Tags:    

Similar News