విషాదం.. కూతురును కౌగిలించుకొని బావిలో దూకిన తల్లి

దిశ, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక తల్లీకూతుళ్లు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పటాన్‌చెరు పట్టణంలోని పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి వివరాల ప్రకారం.. కల్హేర్ మండలం కడపాల్ గ్రామానికి చెందిన చెవిటి విద్య(35), మండలంలోని చిట్కుల్ మహేశ్వరం మెడికల్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ పటాన్‌చెరు పట్టణం రాఘవేంద్ర కాలనీలో కూతురు గోర్లి(5)తో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త దేవదాస్ గతేడాది […]

Update: 2021-08-26 07:59 GMT

దిశ, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక తల్లీకూతుళ్లు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పటాన్‌చెరు పట్టణంలోని పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి వివరాల ప్రకారం.. కల్హేర్ మండలం కడపాల్ గ్రామానికి చెందిన చెవిటి విద్య(35), మండలంలోని చిట్కుల్ మహేశ్వరం మెడికల్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ పటాన్‌చెరు పట్టణం రాఘవేంద్ర కాలనీలో కూతురు గోర్లి(5)తో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త దేవదాస్ గతేడాది ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఒంటరితనంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి.

దీంతో జీవితంపై విరక్తి చెంది ఎలాగైనా చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమచారం. ఈ క్రమంలోనే పట్టణంలోని సాకి చెరువు వద్దకు వెళ్లి కూతురును గట్టిగా కౌగిలించుకొని నీళ్లలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పక్కనే ఉన్న గేదెల కాపరులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తిగా నీటమునిగిన తల్లీకూతుళ్లు, పోలీసులు వచ్చేలోపే మృతిచెందారు. పోలీసులు వారిని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి అన్న రాజు ఫిర్యాదు మేరకు సీఐ వేణుగోపాల్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News