వీడు మామూలోడు కాదు: 200 మంది అమ్మాయిలు..100మంది ఆంటీలతో అలా

దిశ, ఏపీ బ్యూరో: సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని ఓ కేటుగాడు రెచ్చిపోయాడు. ఫేస్‌బుక్, షేర్ చాట్, ఇన్ స్టాగ్రామ్‌లలో తాను అందంగా తయారైన ఫోటోలను అప్‌లోడ్ చేసేవాడు. సోషల్ మీడియాలో తనకు టచ్‌లో ఉన్న వారితో చాటింగ్ చేసి లోబర్చుకునేవాడు. అంతేకాదు వారి నగ్నఫోటోలను సేకరించి వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. మోసాలు చేస్తూ దొరలా బతికిన ఆ కేటుగాడుని కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కిపంపారు. పోలీసులు తెలిపిన వివరాల […]

Update: 2021-08-02 03:12 GMT

దిశ, ఏపీ బ్యూరో: సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని ఓ కేటుగాడు రెచ్చిపోయాడు. ఫేస్‌బుక్, షేర్ చాట్, ఇన్ స్టాగ్రామ్‌లలో తాను అందంగా తయారైన ఫోటోలను అప్‌లోడ్ చేసేవాడు. సోషల్ మీడియాలో తనకు టచ్‌లో ఉన్న వారితో చాటింగ్ చేసి లోబర్చుకునేవాడు. అంతేకాదు వారి నగ్నఫోటోలను సేకరించి వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. మోసాలు చేస్తూ దొరలా బతికిన ఆ కేటుగాడుని కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కిపంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రొద్దుటూరు గీతాశ్రమం వీధికి చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్‌ చిన్నతనంలోనే వ్యసనాలకు బానిసవ్వడంతో బీటెక్ మెుదటి సంవత్సరంలోనే చదువు మానేశాడు. జల్సాలకు డబ్బుల కోసం 2017లో చైన్ స్నాచింగ్‌లతో తన నేరప్రవృత్తికి పని చెప్పడం మెుదలెట్టాడు. అతడిపై ప్రొద్దుటూరు టూటౌన్, త్రిటౌన్, చాపాడు పీఎస్‌ల పరిధిలో నమోదైన పలు కేసుల్లో అతడు జైలుకు సైతం వెళ్లాడు. అనంతరం బెయిల్‌పై తిరిగొచ్చాడు.

ప్రసన్నకుమార్‌కు కడప నబీకోటకు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి షేర్‌చాట్‌ ద్వారా 2020 డిసెంబర్‌లో పరిచయం అయ్యాడు. శ్రీనివాసుతో తన పేరు ప్రశాంత్‌రెడ్డి అలియాస్‌ రాజారెడ్డి అని, హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో పనిచేస్తానని, అక్కడ చాలామంది తెలుసునని నమ్మించాడు. శ్రీనివాసుకు అటెండర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని అతని తల్లిని నమ్మించి డబ్బు, బంగారం గుంజాడు. అంతేకాదు తన తల్లికి అనారోగ్యంగా ఉందని చెప్పి శ్రీనివాస్ తల్లిని నమ్మించడంతో ఆమె బంగారు సరుడు, తాళిబొట్టు అమ్మి మరీ డబ్బు ఇచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్‌రెడ్డి పత్తా లేకుండా పోయాడు.

ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. జూలై 29న కడప అక్కాయపల్లెలో ఓ ఇంటి వద్ద దాచి ఉంచిన తాళం చెవితో ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని ఆభరణాలు దొంగిలించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక టెక్నాలజీ ఆధారంగా ప్రసన్నకుమార్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం బంగారు ఆభరణాలతోపాటు అతడి నేరచరిత్రపై పోలీసులు తమదైన శైలిలో విచారించారు. విచారణలో పోలీసులు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రసన్నకుమార్, ప్రశాంతిరెడ్డి, రాజారెడ్డి, టోనీ పేర్లతో చలామణి అవుతూ అనేక మందిని మోసం చేసినట్లు కడప డీఎస్పీ సునీల్ ఆదివారం వెల్లడించారు. అల్లరి, చిల్లరగా తిరుగుతూ కడప, విజయవాడ, హైదరాబాద్‌ నగరాల్లో షేర్‌చాట్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా అమ్మాయిలు, ఆంటీలను టార్గెట్‌ చేసినట్లు తెలిపారు. వారితో పరిచయం పెంచుకుని ప్రేమలోకి దించి ఆ తర్వాత వారితో అసభ్యకరరీతిలో చాటింగ్‌ చేసేవాడని తమ విచారణలో తేలిందన్నారు. అలాగే వారికి తెలియకుండా వారి నగ్న ఫోటోలను ఫోన్‌లో బంధించి.. వాటిని చూపిస్తూ బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

అంతేకాదు మరికొంతమందిని శారీరకంగా అనుభవించడంతోపాటు వారి నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు కూడా తీసుకెళ్లి, వాటిని అమ్మి జల్సా చేసేవాడని పోలీసులు తెలిపారు. ప్రసన్నకుమార్ సెల్ ఫోన్ ఆధారంగా సుమారు 200 మంది అమ్మాయిలు, 100 మంది మహిళలు అతడి చేతిలో మోసపోయినట్లు గుర్తించామని డీఎస్పీ సునీల్ తెలిపారు. అయితే పరువు పోతుందనే ఉద్దేశంతో బాధితులు ఎవరూ ఫిర్యాదు చేసేందుకు రాలేదని పోలీసులు తెలిపారు. నిందితుడి దగ్గర నుంచి రూ.1,26,000 నగదు, 30గ్రాముల బంగారు గాజులు, ఒక జతకమ్మలు, రెండు ఉంగరాలు, ఒక చెవిరింగ్, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News