నాలుగు జిల్లాల్లో రికార్డు స్ధాయి కేసులు
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఏపీలోని నాలుగు జిల్లాల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అనంతపురం జిల్లాలో 134 కేసులు నమోదైతే, తూర్పుగోదావరి జిల్లాలో 122 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 104 నమోదైతే, కడప జిల్లాలో […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఏపీలోని నాలుగు జిల్లాల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
అనంతపురం జిల్లాలో 134 కేసులు నమోదైతే, తూర్పుగోదావరి జిల్లాలో 122 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 104 నమోదైతే, కడప జిల్లాలో 101 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా ప్రకాశం (79), కృష్ణా (75), కర్నూలు (75) జిల్లాల్లో కూడా భారీ ఎత్తున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం 812 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇతర రాష్ట్రాలు 29, విదేశాల నుంచి వచ్చిన నలుగురికి కరోనా సోకింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 16,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇందులో ఏపీలో సోకిన కేసులు 13,625 అయితే ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారితో కలిపి 16,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. వీరిలో 8,586 మంది వివిధ ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరో 7313 మంది వివిధ ఆస్పత్రుల్లో కరోనాకి చికిత్స పొంది, స్వస్తత చేకూరడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 198 మంది మృతి చెందారని వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.