2020లో మోస్ట్ కామన్ పాస్‌వర్డ్ ఏంటో తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్ : ఈ రోజుల్లో పేరు మర్చిపోయినా పెద్ద సమస్య ఉండదు కానీ, పాస్‌వర్డ్ మర్చిపోతే మాత్రం చాలా కష్టం. అలాగని సులభంగా గుర్తుండే పాస్‌వర్డ్‌లు పెట్టుకుందామంటే హ్యాకర్ల భయం. వాళ్లేదో మన సమాచారాన్ని దోచేస్తారని కాదు గానీ మన ఖాతాతో ఇంకేదైనా తప్పుడు పనిచేస్తారన్న భయం. అయినప్పటికీ చాలా సులభంగా ఉండే పాస్‌వర్డ్‌ను పెట్టుకోవడానికే జనాలు మొగ్గుచూపుతున్నారు. ఈ మాట మేం అనడం లేదు. నోర్డ్‌పాస్ వారు విడుదల చేసిన ఒక నివేదికలో ఈ […]

Update: 2020-11-21 05:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈ రోజుల్లో పేరు మర్చిపోయినా పెద్ద సమస్య ఉండదు కానీ, పాస్‌వర్డ్ మర్చిపోతే మాత్రం చాలా కష్టం. అలాగని సులభంగా గుర్తుండే పాస్‌వర్డ్‌లు పెట్టుకుందామంటే హ్యాకర్ల భయం. వాళ్లేదో మన సమాచారాన్ని దోచేస్తారని కాదు గానీ మన ఖాతాతో ఇంకేదైనా తప్పుడు పనిచేస్తారన్న భయం. అయినప్పటికీ చాలా సులభంగా ఉండే పాస్‌వర్డ్‌ను పెట్టుకోవడానికే జనాలు మొగ్గుచూపుతున్నారు.

ఈ మాట మేం అనడం లేదు. నోర్డ్‌పాస్ వారు విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయం తేలింది. 2020 సంవత్సరంలో ఎక్కువగా ఉపయోగించిన పాస్‌వర్డ్‌ల పేరుతో నోర్డ్‌పాస్ కంపెనీ ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో అత్యంత ఎక్కువగా ఉపయోగించిన పాస్‌వర్డ్ ఏంటో తెలుసా? 123456 అవును.. 2020లో 23,597,311 ఖాతాలకు వరుసగా ఈ ఆరు అంకెలను పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారు.

ఇంత సులభమైన పాస్‌వర్డ్ పెట్టుకోవడం వల్ల వారి ఖాతాలను నిమిషంలో హ్యాక్ చేయవచ్చని కూడా నోర్డ్‌పాస్ నివేదిక వెల్లడించింది. మొత్తంగా 200 మోస్ట్ కామన్ పాస్‌వర్డ్‌ల జాబితాలో 123456789, picture1, password, 12345678, 111111, 123123, 12345, 1234567890, senha, 1234567, qwerty, abc123, Million2, 000000, 1234, iloveyou, aaron431, password1, qqww1122 లాంటి పాస్‌వర్డ్‌లు టాప్ 20లో ఉన్నాయి.

వీటిలో ఆంగ్ల అక్షరాలు, అంకెలు కలిసి ఉన్న పాస్‌వర్డ్‌లను క్రాక్ చేయడానికి రెండు గంటలు సమయం పడుతుందని, మిగతా వాటిని క్రాక్ చేయడానికి పది సెకన్ల నుంచి 60 సెకన్ల సమయం పడుతుందని నోర్డ్‌పాస్ వివరించింది. ఈ డిజిటల్ యుగంలో ఇలాంటి దారుణమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవద్దని, కనీసం ఫోన్ నంబర్, పుట్టినరోజు, పేరు కలిసేలా ఎనిమిది అక్షరాలకు మించి పాస్‌వర్డ్ పెట్టుకుంటే మంచిదని నోర్డ్‌పాస్ సూచించింది.

Tags:    

Similar News