2021లో భారత వృద్ధి రేటు 6.9 శాతంగా మూడీస్ అంచనా!
దిశ, సెంట్రల్ డెస్క్: భారత ఆర్థిక వృద్ధి 2020 ఏడాదిలో 3.1 శాతానికి తగ్గిపోతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనాలను వెల్లడించింది. చైనాతో సరిహద్దు ఘర్షణలు ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న నష్టాలను సూచిస్తున్నాయని మూడీస్ తెలిపింది. ఏప్రిల్ నెలలో వార్షిక ఆర్థిక వృద్ధి 0.2 శాతం వృద్ధిని నమోదు చేసిందని, కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన అంతరాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సవరించినట్టు మూడీస్ అభిప్రాయపడింది. 2021 ఏడాదికి భారత ఆర్థిక వృద్ధి […]
దిశ, సెంట్రల్ డెస్క్: భారత ఆర్థిక వృద్ధి 2020 ఏడాదిలో 3.1 శాతానికి తగ్గిపోతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనాలను వెల్లడించింది. చైనాతో సరిహద్దు ఘర్షణలు ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న నష్టాలను సూచిస్తున్నాయని మూడీస్ తెలిపింది. ఏప్రిల్ నెలలో వార్షిక ఆర్థిక వృద్ధి 0.2 శాతం వృద్ధిని నమోదు చేసిందని, కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన అంతరాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సవరించినట్టు మూడీస్ అభిప్రాయపడింది. 2021 ఏడాదికి భారత ఆర్థిక వృద్ధి రేటు 6.9 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికం చరిత్రలో నిలిచిపోనుందని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే చెత్త త్రైమాసికంగా రికార్డు అవుతుందని మూడీస్ అభిప్రాయపడింది. ప్రస్తుత సంవత్సరం రెండో భాగం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని ఆశిస్తున్నట్టు, అయితే, దీనికి ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థను ఎలా కొనసాగిస్తాయనే దానిపై ఆధారపడి ఉందని మూడీస్ పేర్కొంది. ఇక, ఈ ఏడాది వృద్ధిని నమోదు చేసిన దేశాల్లో ఏకైక జీ20 దేశం చైనాయే అని మూడీస్ అంచనా వేసింది. ప్రస్తుత ఏడాది చైనా వృద్ధి రేటు 1 శాతం ఉండొచ్చని, 2021లో 7.1 శాతం ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. అలాగే, 2020లో జీ20 దేశాల ఆర్థిక వృద్ధి రేటు 4.6 శాతం ఉన్నట్టు, అది 2021కి 5.2 శాతం వృద్ధి సాధిస్తుందని మూడీస్ తెలిపింది.