జీఎస్టీఆర్-1 గడువును జూన్ 26 వరకు పొడిగించిన ప్రభుత్వం!
దిశ, వెబ్‌డెస్క్: మే నెలకు సంబంధించి నెలవారీ జీఎస్టీ రిటర్నుల దాఖలు గడువును జూన్ 26 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం సోమవారం తెలిపింది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్ (సీబీఐసీ) వివిధ రిటర్నుల సడలింపులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది మే నెలకు సంబంధించిన అమ్మకాల రిటర్న్ లేదా జీఎస్‌టీఆర్-1 సరఫరా చేసిన వస్తువుల వివరాలను ఇవ్వడానికి గడువు తేదీని […]
దిశ, వెబ్‌డెస్క్: మే నెలకు సంబంధించి నెలవారీ జీఎస్టీ రిటర్నుల దాఖలు గడువును జూన్ 26 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం సోమవారం తెలిపింది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్ (సీబీఐసీ) వివిధ రిటర్నుల సడలింపులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది మే నెలకు సంబంధించిన అమ్మకాల రిటర్న్ లేదా జీఎస్‌టీఆర్-1 సరఫరా చేసిన వస్తువుల వివరాలను ఇవ్వడానికి గడువు తేదీని 15 రోజులు పొడిగించారు.
2020-21 ఆర్థిక సంవత్సరానికి కంపోజిషన్ డీలర్లు వార్షిక రిటర్న్ దాఖలు చేసేందుకు గడువును జులై 31 వరకు మూడు నెలలు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. అలాగే, కంపెనీ చట్టం కింద నమోదు చేసుకున్న పన్ను చెల్లింపుదారులకు ఆగష్టు 31 వరకు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్‌కు బదులుగా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్‌ను ఉపయోగించి జీఎస్టీ రిటర్న్ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.