‘దాసరి వెలిగించిన దీపాన్ని నేను’

దర్శకరత్న దాసరి నారాయణ రావు వర్ధంతిని పురస్కరించుకుని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయనను స్మరించుకున్నారు. ‘నటుడుగా నాకు జన్మనిచ్చిన మహోన్నత వ్యక్తి, నా గురువు దాసరి నారాయణ రావు’ అని తెలిపారు. భారతదేశ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మహా దర్శకుడని.. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, రాజకీయవేత్తగా నవరసాలూ ఆయనలో ఉన్నాయన్నారు. ‘దాసరి ఎంతోమందిని దీపాలుగా వెలిగించారు. ఆ దీపాలు ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నాయి, అందులో నేనూ ఒకడిని. సినిమాలో ఎన్ని పాత్రలుంటాయో అన్ని […]

Update: 2020-05-30 06:59 GMT

దర్శకరత్న దాసరి నారాయణ రావు వర్ధంతిని పురస్కరించుకుని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయనను స్మరించుకున్నారు. ‘నటుడుగా నాకు జన్మనిచ్చిన మహోన్నత వ్యక్తి, నా గురువు దాసరి నారాయణ రావు’ అని తెలిపారు. భారతదేశ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మహా దర్శకుడని.. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, రాజకీయవేత్తగా నవరసాలూ ఆయనలో ఉన్నాయన్నారు.

‘దాసరి ఎంతోమందిని దీపాలుగా వెలిగించారు. ఆ దీపాలు ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నాయి, అందులో నేనూ ఒకడిని. సినిమాలో ఎన్ని పాత్రలుంటాయో అన్ని పాత్రలూ ఒక్కొక్క సినిమాలో ఒక్కోవిధంగా నా కోసం క్రియేట్ చేసి ఆయన కలం ద్వారా నన్ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి నా గురువు’ అని చెప్పారు.

తెలుగు సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్‌ను దాసరి చూసిన విధంగా మరొకరు చూడలేరని అన్నారు. ఆయనెక్కడున్నా వారి ఆశీస్సులు మా కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News