‘రజకులను అంటరానివాళ్లని చేశారు’

దిశ, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రజకుల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా.. అంటరానివాళ్లుగా చేసిందని తెలంగాణ రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వర్గాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించారని.. కానీ, రజకులకు ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. 2016-17 ఏడాదిలో రజకులకు బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించినట్టు చెప్పినా.. ఒక్క రూపాయి కూడా అందలేదన్నారు. గ్రూపులుగా తయారు […]

Update: 2020-03-17 05:38 GMT

దిశ, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రజకుల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా.. అంటరానివాళ్లుగా చేసిందని తెలంగాణ రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వర్గాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించారని.. కానీ, రజకులకు ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. 2016-17 ఏడాదిలో రజకులకు బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించినట్టు చెప్పినా.. ఒక్క రూపాయి కూడా అందలేదన్నారు. గ్రూపులుగా తయారు అయితే రుణాలు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణ రాక ముందు.. వచ్చాకా రజకుల బతుకులు అలాగే ఉన్నాయన్నారు. ఇందిరాపార్కు ధర్నా‎చౌక్‌లో ఈ రోజు తలపెట్టిన రజక ధర్మ పోరాట దీక్షను కరోనా కారణంగా వాయిదా వేసినట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు రాజశేఖర్, రాజు, వీరబాబు, సాయిబాబు పాల్గొన్నారు.

Tags: Mogga Anil Rajaka, Youth State President, comments, against, govt

Tags:    

Similar News