మోడీది.. దునియా చుట్టొచ్చిన దిమాగ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరుణ్ మిశ్రా ప్రశంసలు కురిపించారు. మోడీ ప్రపంచస్థాయి ఆలోచనలు కలిగిన నేత అని, స్థానిక అవసరాలకు తగినట్టు వ్యవహరిస్తారని కితాబిచ్చారు. ప్రపంచం గుర్తించిన దార్శనికుడు అని పొగిడారు. సుప్రీంకోర్టు ఆవరణలో నిర్వహించిన ఇంటర్నేషనల్ జ్యుడీషియరీ కాన్ఫరెన్స్ 2020 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్.. అంతర్జాతీయవర్గానికి సన్నిహిత, బాధ్యతాయుతమైన సభ్యురాలిగా ఉన్నదని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేందుకు కట్టుబడ్డ భారత్.. ప్రపంచ శాంతి భద్రతలకు అంకితమైందని వివరించారు. […]
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరుణ్ మిశ్రా ప్రశంసలు కురిపించారు. మోడీ ప్రపంచస్థాయి ఆలోచనలు కలిగిన నేత అని, స్థానిక అవసరాలకు తగినట్టు వ్యవహరిస్తారని కితాబిచ్చారు. ప్రపంచం గుర్తించిన దార్శనికుడు అని పొగిడారు. సుప్రీంకోర్టు ఆవరణలో నిర్వహించిన ఇంటర్నేషనల్ జ్యుడీషియరీ కాన్ఫరెన్స్ 2020 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్.. అంతర్జాతీయవర్గానికి సన్నిహిత, బాధ్యతాయుతమైన సభ్యురాలిగా ఉన్నదని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేందుకు కట్టుబడ్డ భారత్.. ప్రపంచ శాంతి భద్రతలకు అంకితమైందని వివరించారు. అలాగే, న్యాయవ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరమున్నదనీ నొక్కిచెప్పారు.