బండి సంజయ్‌కు ఫోన్ చేసి మోడీ ఏం మాట్లాడారు?

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో, ఎన్నికల స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు, ఎన్నికల సరళిపై పార్టీ పరిస్థితులపై ముచ్చటించినట్టు సమాచారం. కార్యకర్తలు అధ్బుతంగా పోరాటం చేశారని ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు. బీజేపీ నాయకుల, కార్యకర్తలపై జరిగిన దౌర్జన్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. […]

Update: 2020-12-02 02:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో, ఎన్నికల స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు, ఎన్నికల సరళిపై పార్టీ పరిస్థితులపై ముచ్చటించినట్టు సమాచారం. కార్యకర్తలు అధ్బుతంగా పోరాటం చేశారని ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు. బీజేపీ నాయకుల, కార్యకర్తలపై జరిగిన దౌర్జన్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ కార్యకర్తల పోరాట పటిమను ప్రశంసించినట్టు తెలుస్తోంది. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ నడుచుకోడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతేగాకుండా దైర్యంగా ముందుకు సాగాలని, అన్నివిధాలా అండగా ఉంటామని ప్రధాని సంజయ్‌కి హామీ ఇచ్చారు. దీంతో ఇప్పటికే దూకుడు మీద బండి సంజయ్.. ప్రధాని ఫోన్‌తో మరింత ఉత్సాహంతో పనిచేయనున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News