మోడీ ‘యోగా’ ఇంకా ఖరారు కాలేదు
న్యూఢిల్లీ: ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనడంపై ఇంకా తుది నిర్ణయం ఖరారు కాలేదని కేంద్రం తెలిపింది. తొలుత ఆయన లడాఖ్‌లోని లేహ్‌లో ప్రధాని మోడీ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతున్నట్టు ఖరారైంది. అయితే, తాజాగా, కరోనా విలయం కారణంగా లేహ్‌కు మోడీ ప్రయాణించడం అనుమానమేనని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లేహ్‌లో ఆయన పాల్గొనడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయుష్ శాఖ కార్యదర్శి వైద్య […]
న్యూఢిల్లీ: ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనడంపై ఇంకా తుది నిర్ణయం ఖరారు కాలేదని కేంద్రం తెలిపింది. తొలుత ఆయన లడాఖ్‌లోని లేహ్‌లో ప్రధాని మోడీ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతున్నట్టు ఖరారైంది. అయితే, తాజాగా, కరోనా విలయం కారణంగా లేహ్‌కు మోడీ ప్రయాణించడం అనుమానమేనని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లేహ్‌లో ఆయన పాల్గొనడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయుష్ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా తెలిపారు. కాగా, బిగ్ ఈవెంట్ డిజిటల్ మాధ్యమంలో ఉంటుందని చెప్పారు. ఈ సారి యోగా డే వేడుకలను డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో జరుపుకోవాలని, ఒకే చోట గుమిగూడటం కుదరదని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది యోగా డే థీమ్ ‘యోగా ఎట్ హోం, యోగా విత్ ఫ్యామిలీ’ అని ప్రకటించిన విషయం తెలిసిందే.