‘హెచ్1బీ, ఉగ్రవాదుల చొరబాటుపై చర్చిస్తారు’
భారత్ పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మన ప్రధాని నరేంద్ర మోడీ జరిపే చర్చల్లో హెచ్1బీ వీసాల జారీ అంశం కీలకంగా ఉంటుందని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి రవీష్ కుమార్ తెలిపారు. మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. హెచ్1బీ వీసాల జారీ అంశంపై ప్రభుత్వం అమెరికా సర్కారుతో చర్చిస్తూనే ఉన్నదని తెలిపారు. మన దేశ ప్రొఫెషనల్స్ అమెరికా తోడ్పాటుకు ఎంతో సహకరించారని తాము భావిస్తామని అన్నారు. ట్రంప్ పర్యటనను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని […]
భారత్ పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మన ప్రధాని నరేంద్ర మోడీ జరిపే చర్చల్లో హెచ్1బీ వీసాల జారీ అంశం కీలకంగా ఉంటుందని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి రవీష్ కుమార్ తెలిపారు. మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. హెచ్1బీ వీసాల జారీ అంశంపై ప్రభుత్వం అమెరికా సర్కారుతో చర్చిస్తూనే ఉన్నదని తెలిపారు. మన దేశ ప్రొఫెషనల్స్ అమెరికా తోడ్పాటుకు ఎంతో సహకరించారని తాము భావిస్తామని అన్నారు. ట్రంప్ పర్యటనను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఈ పర్యటనతో అంతర్జాతీయంగా భారత్ వ్యూహాత్మక సంబంధాలు బలపడుతాయని వివరించారు. ఉగ్రవాదుల చొరబాటుపైనా భారత ప్రధాని మోడీ, యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ చర్చించనున్నట్టు తెలిపారు.