కార్లకు మోడ్రన్ లుక్
షోరూం నుంచి అన్ని హంగులున్న కారు కొన్నా.. దాన్ని మాడిఫై చేస్తే వచ్చే లుక్కే వేరు. నలుగురి దృష్టిని ఆకర్షించడానికి, చూసిన వారు వావ్ అనేలా బండిని ఎక్సాట్రా ఫిట్టింగ్స్, మోడలింగ్ చేయిస్తున్నారు. ఈ తరహా క్రేజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. పాత, కొత్త కారు అనే తేడా లేకుండా మోడ్రన్ లుక్ కోసం వాహనదారులు ఆరాటపడుతున్నారు. వాహనం బయట, లోపల షోకేజ్ లు అద్దుతున్నారు. దీంతో నగరంలోని కార్ డెకార్స్ బిజినెస్ కు […]
షోరూం నుంచి అన్ని హంగులున్న కారు కొన్నా.. దాన్ని మాడిఫై చేస్తే వచ్చే లుక్కే వేరు. నలుగురి దృష్టిని ఆకర్షించడానికి, చూసిన వారు వావ్ అనేలా బండిని ఎక్సాట్రా ఫిట్టింగ్స్, మోడలింగ్ చేయిస్తున్నారు. ఈ తరహా క్రేజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. పాత, కొత్త కారు అనే తేడా లేకుండా మోడ్రన్ లుక్ కోసం వాహనదారులు ఆరాటపడుతున్నారు. వాహనం బయట, లోపల షోకేజ్ లు అద్దుతున్నారు. దీంతో నగరంలోని కార్ డెకార్స్ బిజినెస్ కు ఫుల్ డిమాండ్ వచ్చేసింది.
దిశ, శేరిలింగంపల్లి: వెహికిల్ ఇప్పుడు అత్యవసరమే కాదు నిత్యవసరం కూడా. దీంతో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ మార్కెట్లో అనేక రకాల మోడల్స్ వచ్చాయి. ఇష్టపడి కొనుగోలు చేసుకున్న కార్లు.. మోడ్రన్ లుక్ లో ఆకట్టుకునేలా రీ మోడల్ చేస్తున్నారు. ఇందుకోసం నగరంలో అనేక ఆక్సెసరీస్ షోరూంలు, కార్ డెకార్స్ ఉన్నాయి. కారు ఇన్నర్ డెకార్స్ తో పాటు బయట లుక్ ఎలా కావాలంటే అలా మార్చేస్తుంటారు. ఈ తరహా క్రేజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. ఒక్కో కార్ డెకార్స్ షాప్ లో రోజు పదుల సంఖ్యలో కార్లను రీ మోడల్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాయి.
కస్టమర్స్ టేస్ట్ తగ్గట్టుగా..
కారు కొనేప్పుడు అన్ని హంగులు చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. అయినా మరిన్ని యాక్సెసరీస్ ఇష్టం ఉన్నవారు తమకు కావాల్సిన విధంగా మళ్లీ ఎక్స్ ట్రా ఫిట్టింగ్ చేయిస్తూ ఉంటారు. అలా కాదని బేసిక్ మోడల్ కార్లు కొన్నవారు తక్కువ ఖర్చులోనే తమకు నచ్చినట్లు, లగ్జరీ కార్లకు ఏమాత్రం తీసిపోకుండా మాడిఫై చేసుకుంటున్నారు. ఇక సెకండ్ హ్యాండ్ కార్లు కొన్న వారైతే కొత్త కారుకు ఏమాత్రం తీసిపోకుండా హంగులను అద్దుతున్నారు. వీల్ క్యాప్స్ నుంచి మొదలు పెయింటింగ్ వరకూ అన్నీ ఒకేచోట ఉంటుండడంతో తమకు నచ్చిన విధంగా కార్లను తీర్చిదిద్దుతున్నారు. అలా అని వాహన చట్టాలను ఏమీ ఉల్లంఘించడం లేదని చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం కాస్త శృతిమించుతున్నారని, పెద్ద పెట్టున శబ్దాలు వచ్చేలా సైలెన్సర్లు మార్చడం, ఎక్స్ ట్రా ఫోకస్ లైట్లు ఫిట్ చేయించడం లాంటివి చేస్తున్నారు. దీనివల్ల వాహనదారులకు మాత్రమే కాదు అందరికి ఇబ్బంది తలెత్తుతోంది.
అన్నీ ఒకేచోట..
ఒక్కసారి కార్ డెకార్స్ షాప్స్ కు వెళ్తే చాలూ ఇది మా దగ్గర లేదు అనేది లేకుండా కస్టమర్స్ అడిగిన ప్రతీ యాక్సెసరీ అందుబాటులో ఉంచుతున్నారు. చందానగర్ లోని క్రేజీ కార్ డెకార్స్ లో కారు ఇంటీరియర్, కలరింగ్, బంపరింగ్ ప్రతీది అందుబాటులో ఉంటుంది. హలే వీల్స్, సీట్ కవర్లు, సౌండ్ సిస్టం, ఫర్ఫ్యూమ్స్, ఫిల్మ్స్, ఛార్జర్లు, సైకిల్ స్టాండ్స్, క్యారియర్స్, లైటింగ్, హెడ్ రెస్ట్స్, ఫుట్ కవర్స్, మొబైల్ యాక్సెసరీస్, హెడ్ సెట్స్ ప్రతీది అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చందానగర్, శేరిలింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, ఆల్విన్ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, నిజాంపేట్ ఏరియాలో పదుల సంఖ్యలో కార్ డెకార్స్ షాప్స్ ఉన్నాయి. ఎన్ని షాప్స్ ఉన్న గిరాకీ మాత్రం ఫుల్ గా ఉంటుందని షాపు యజమానులు చెబుతున్నారు.
ఆల్ యాక్సెసరీస్ అవైలబుల్
మాదగ్గర అన్ని మోడల్ కార్లకు సంబంధించిన యాక్సెసరీస్ దొరుకుతాయి. మార్కెట్లో లభించే అన్ని కార్లకూ వీల్ కవర్స్ నుంచి మొదలు సీట్ కవర్ల వరకూ లభిస్తాయి. కస్టమర్లు కోరిన విధంగా తాము కారును రెడీ చేసి ఇస్తాం. చాలామంది బేసిక్ మోడల్స్ కార్లలో హైఎండ్ ఫీచర్స్ ఉండాలని అడుగుతుంటారు. అలాగే చేసి పెడతాం.
-నవీన్, క్రేజీ కార్ డెకార్స్ ఓనర్
నచ్చినట్టు మార్చిస్తాం
కొత్త పాత కార్లకు డెకార్స్ చూస్తుంటాం. కారు ఎలా ఉండాలో చెబితే చాలూ అలా తయారు చేస్తుంటాం. చాలామంది సౌండ్ సిస్టం బాగుండాలని, సీటింగ్ కవర్లు, లైటింగ్ బాగుండాలని చెబుతుంటారు. మేము బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటినే కస్టమర్లకు అందిస్తాం. రోజుకు 5 నుంచి 8 పాత, కొత్త కార్లకు డెకార్స్ చేస్తుంటాం.
-మహ్మద్ ఆసీఫ్