హర్యానాలోని 17జిల్లాల్లో మొబైల్ సేవలు బంద్
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్, హర్యానా రైతులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గణతంత్ర వేడుకల్లో రైతు సంఘాలు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారిన తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు కాగా, ఢిల్లీ సరిహద్దులోని ప్రాంతాల్లో రైతు శిబిరాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. […]
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్, హర్యానా రైతులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గణతంత్ర వేడుకల్లో రైతు సంఘాలు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారిన తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు కాగా, ఢిల్లీ సరిహద్దులోని ప్రాంతాల్లో రైతు శిబిరాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.
ఈ క్రమంలోనే హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 17జిల్లాల్లో ఇంటర్నెట్, మొబైల్ ఎస్‌ఎమ్‌ఎస్ సేవలను శనివారం సాయంత్రం 5 గంటలకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సోనిపట్, జాజ్జర్, పాల్వాల్ ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమలవుతుండగా, అంబాలా, యుమునా నగర్, కురుక్షేత్ర, కర్నాల్, కైతాల్, పానిపట్, హిసర్, జింద్, రోహ్‌తక్, బీవాని, చార్కిదాద్రి, రేవారి, ఫతేహబాద్, సిర్సా ప్రాంతాల్లో రేపు సాయంత్రం వరకు మొబైల్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నిర్ణయంతో రైతు ఆందోళనలను కంట్రోల్ చేయాలని శివరాజ్ సింగ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.